నాలుగున్నరేళ్ళ పాటు పార్టీకి కష్టపడి పనిచేసిన నాయకులు వాళ్ళంతా. . డబ్బు లేదని  ఒక్కసారిగా వాళ్ళను పక్కన పెట్టడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. జనంతో మమేకం అయిన వాళ్ళను తప్పించి డబ్బే ముఖ్యమని చెప్పడం పట్ల రగిలిపోతున్నారు. ఇది ఆ పార్టీకి డేంజర్ సిగ్నల్ లాంటిదేనని అంటున్నారు.


డైరెక్ట్ గానే :


ఆయన విశాఖ నగరంలో ఓ ప్రముఖ డాక్టర్. పార్టీలో ఇలా చేరారో లేదో ఆలా విశాఖ దక్షిణం టికెట్ ఇచ్చేశారు. దాంతో అక్కడ ఇంచార్జ్ గా ఉన్న కోలా గురువులు వర్గం అసంత్రుప్తితో రగిలిపోతోంది. చిత్రమేంటంటే ఆయన సామాజిక వర్గం కూడా ఆ నియోజకవర్గంలో లేదు. అయినా ఏరీ కోరీ వైసీపీ  పదవి అప్పచెప్పారు. అక్కడ పార్టీకి అంతా బాగుందని  అనుకుంటున్న వేళ ఈ పరిణామాలు ఇబ్బందిగా మారాయి. పైగా బలమైన సామజికవర్గానికి చెందిన గురువులును తప్పించడం మైనస్ అంటున్నారు. 


ఇక్కడా ఇంతే:


అలాగే ఉత్తర నియోజకవర్గంలోనూ సేం సీన్. పార్టీ కోసం పనిచేసిన వాళ్ళను పక్కన పెట్టేసి హఠాత్తుగా చేరిన ఓ రియల్ ఎస్టేట్ వ్యక్తిని ఇంచార్జ్ ని చేసేశారు. ఆయన బాగా డబ్బు ఖర్చు చేయగలరన్న ఒకే ఒక పాయింట్ మీదనే ఈ సెలెక్షన్ జరిగిపోయింది. ఇక్కడ పార్టీకి మూడేళ్ళుగా పనిచేస్తున్న ముగ్గురు నాయకులకు గట్టి ఝలక్ తగిలింది. ఇది పార్టీలో అలజడి రేపుతోంది.


ఆ సీటేనా :


ఆయన ఓ రియల్ వ్యాపారి. జనాలకు పెద్దగా తెలియని వ్యక్తి. వైసీపీ కోరి మరీ పార్టీలో చేర్చుకుని విశాఖ పార్లమెంట్ ఇంచార్జ్ ని చేసేసింది. ఆయనను రేపు ప్రతిష్టాత్మకమైన విశాఖ ఎంపీ సీటుకు పోటీ పెడటారని టాక్. అదే జరిగితే అర్ధబలం ఒక్కటే గెలుపునకు సరిపోతుందా. మరేమీ అక్కరలేదా అని పార్టీలో ప్రశ్నలు వస్తున్నాయి.


ఇదే కోలమానమా :


వైసీపీకి జనాల్లో మంచి స్పందన ఉంది. దాన్ని సక్రమంగా వాడుకుంటే గెలిచే అవకాశాలు కూడా ఉంటాయి. కానీ డబ్బున్న వాళ్ళను తీసుకువచ్చి పార్టీ నెత్తిన రుద్దితే ఎలా గెలిపిస్తామని క్యాడర్ అంటోంది. జిల్లాలో అనేక అసెంబ్లీ సీట్ల విషయంలోనూ ఇదే తీరున ఇంచార్జ్ లను వేస్తున్నారు, తీస్తున్నారు. మరి రేపటి ఎన్నికల యుధ్ధంలో విజయం సాధించేందుకు ఈ వ్యూహం పనిచేస్తుందా...బెడిసికొడుతుందా


మరింత సమాచారం తెలుసుకోండి: