తెలంగాణ లో ఇప్పుడు రేవంత్ రెడ్డి మేటర్ హాట్ టాపిక్ అని చెప్పవచ్చు. అయితే దర్యాప్తు అధికారులు చార్జిషీటు తయారుచేసే పనిలో ఉన్నారని, అది కాగానే అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుస్తారని తెలుస్తోంది. బెయిల్‌ రావడానికి 90 రోజుల సమయం పడుతుందట. రేవంత్‌ను అక్టోబరు మూడో తేదీన ఇంటరాగేషన్‌ చేస్తారు. అది చేసి వదిలేస్తారా? లేదా అక్కడే అరెస్టు చేసి కోర్టుకు తీసుకెళతారా? అనేది ఉత్కంఠభరితంగా ఉంది.

Image result for revanth reddy

అన్ని అంశాల్లో  దర్యాప్తు దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది. రేవంత్‌ రెడ్డి భార్య గీతను మరోసారి ప్రశ్నించాక, చివరగా రేవంత్‌ను ఇంటరాగేషన్‌ చేసి ఏం చేయాలనేది అధికారులు నిర్ణయించుకుంటారు. గతంలో ఓటుకు నోటు కేసులో అరెస్టయి జైలుకు వెళ్లి రేవంత్‌కు ఇది అంతకంటే పెద్ద అగ్నిపరీక్షలా మారింది. అందులోనూ ఎన్నికల సమయం కావడంతో తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చనీయాంశమైపోయింది. ఇది కేవలం రేవంత్‌ అక్రమాస్తులకు సంబంధించిన వ్యవహారమే కాకుండా ఇందులోనే ఓటుకు నోటు కేసు కూడా ఇమిడి ఉంది. ఇదిలా ఉంచితే, మరో ఉత్కంఠభరితమైన అంశం బతుకమ్మ చీరలు, రైతు బంధు చెక్కుల పంపిణీ. దీనిపై కేసీఆర్‌ విపరీతంగా టెన్షన్‌ పడుతున్నారు.

Image result for kcr

ఇవి రెండు ఓట్లు కురిపించే పథకాలు. ఈ రెండింటిని గత ఏడాది అమలు చేశారు. కాని ఈసారి ఎన్నికల కోడ్‌ అడ్డుగా ఉంది. అసెంబ్లీ రద్దయిననాటి నుంచే ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిందని ఎన్నికల సంఘం ప్రకటించడంతో కేసీఆర్‌ ఇబ్బంది పడుతున్నారు. అధికారుల్లో దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కోడ్‌ అమల్లో ఉందని కొందరు చెబుతుండగా, ఎన్నికల షెడ్యూలు విడుదలయ్యాక కోడ్‌ అమలుల్లోకి వస్తుందని మరికొందరు చెబుతున్నారు. ఇవి రెండు పాత పథకాలే కాబట్టి అమలుకు ఇబ్బంది ఉండదని కేసీఆర్‌ అభిప్రాయం. ఓట్లు తెచ్చిపెట్టే ఈ పథకాలను ఎట్టి పరిస్థితిలోనూ అమలుచేసి తీరాలని కేసీఆర్‌ పట్టుదలగా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: