ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాలుగు దశాబ్ధాల సుధీర్ఘ అనుభవంలో చేసిన ఘనకార్యాల ఫలితాలు ఇప్పుడిప్పుడే బహిరంగమౌతున్నాయి. అమెరికా యాత్రలో ఆయన ధారుణ చేదు అనుభవం అదీ తనకత్యంత ప్రీతిపాత్రమైన స్వజనులమధ్యే చవి చూశారు. తన పర్యటన సందర్భంగా తెలుగుదేశం పార్టీ  ఎన్నారైలు అంటే ఎక్ష్టెన్షన్ ఒఫ్ టిడిపి ఇన్ యుఎస్ ఏర్పాటు చేసిన కార్యక్రమం లో ముఖ్యమంత్రి పాల్గొన్న సందర్భంగా ఈ మద్య అమెరికాలో వెల్లువెత్తిన "తెలుగు సినీతారల సెక్స్‌ రాకెట్‌" లోని నిందితులను పక్కన కూర్చోబెట్టుకొని చంద్రబాబు ప్రసంగించడంపై అక్కడి సభలోని సభ్యుల నుండి తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. 



సెక్స్‌రాకెట్‌ వ్యవహారంలో నిండా ఇరుక్కున్న నిందితుల్ని అతి చొరవతో పక్కన కూర్చో పెట్టుకుని ముఖ్యమంత్రి ప్రసంగించటమేమిటని, జాతికి అగౌరవాన్ని ఆపాదించి పెట్టిన వారిని వెంటనే వేదిక నుంచి దించేయాలంటూ పెద్దఎత్తున సభలో అలజడి చెలరేగటంతో చంద్రబాబు ఒక రకంగా కంగుతినటమే కాదు సభికుల నుండి చిన్న చూపుకు అసహనానికి గురయ్యారు. 



ఈ సందర్భంగా అరుపులు, కేకలు, కలకలంతో సభలో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. ముఖ్యమంత్రి ఈ నెల 23న ఐఖ్య రాజ్య సమితిలో ప్రసంగించే నిమిత్తం అమెరికాకు వెళ్లడం తెలిసిందే (అది ఐఖ్యరాజ్య సమితి కార్యక్రమం కాదని బిజెపి వైసిపి వాళ్లు నిర్ద్వందంగా చెపుతున్నారు).
Image result for chandrababu felt insulted in TDP NRIs meet in New jersey
అదే రోజున విశాఖ మన్యంలో ప్రభుత్వ విప్‌ కిడారి సర్వేశ్వరరావు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను మావోయిస్టులు కాల్చిచంపారు. జంటహత్యల విషయం ప్రయాణం లోనే తెలుసుకున్నా కొంత మౌనం ప్రదర్శించారని సమాచారం. బాబు అమెరికా చేరుకున్నాక న్యూజెర్సీలోని టీడీపీ ఎన్నారై విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్య క్రమంలో ప్రసంగించేందుకు సిద్ధమయ్యారు. 



ఆయన ప్రసంగం ప్రారంభించిన వెనువెంటనే అక్కడ వేదికపై సినీతారల సెక్స్‌రాకెట్‌లో ఇన్వాల్వ్ అయిన నిందితులే చంద్రబాబు ప్రక్కన ఆశీనులైన దృశ్యం సభాసదు ల్ని కలచివేయగా వారి నుంచి ప్రతిఘటన ఎదురైంది. మీ పక్కన కూర్చుని ఎవరు కూర్చున్నారు? ఒక సిగ్గుమాలిన నేరంలో పాలుపంచుకున్న నేరస్తులు ఉన్నారని, ముందు  వారిని సభావేదిక నుంచి కిందకు దించేయాలంటూ ప్రతిఘటనకు దిగారు. 




వారిలో చెలరేగిన అలజడి అరుపులు, కేకల రూపంలో బయటపడి సభలో తీవ్ర కలకలం రేగింది. దీంతో ఏం జరుగుతుందో తెలియక తొలుత అయోమయానికి కొంత అవమానానికి గురైన చంద్రబాబు నాయుడు తర్వాత ప్రసంగాన్ని ఆపి వారికి తానే సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఈలోగా కార్యక్రమ నిర్వాహకులు జోక్యం చేసుకుని సెక్స్‌ రాకెట్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న వారిని సముదాయించారు. 




టీడీపీ ఎన్నారైల నుంచి ఊహించని రీతిలో చేదు అనుభవం ఎదురవడంతో ఖంగుతిన్న చంద్రబాబు తన ప్రసంగాన్ని కొనసాగించినప్పటికీ ఏపీలో మావోయిస్టులు టీడీపీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలను హత్య చేశారని, వారి మృతికి తన సంతాపం తెలుపుతున్నానంటూ తన ఉపన్యాసాన్ని ముగించి సమయస్పూర్తిగా పోయేపరువును కనిపించ కుండా చేయడం గమనార్హం.
Image result for sex racket in USA
సాంస్కృతిక కార్యక్రమాల పేరుతో సినీతారలను అమెరికాకు తీసుకొచ్చి వారితో వ్యభిచారం చేయిస్తున్నారంటూ గత జూన్‌లో కేసునమోదవటం సర్వత్రా తెలిసినవిషయమే ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న చికాగో పోలీసులు తీగలాగగా డొంకంతా కదిలింది. ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ఆయన తనయుడు లోకేశ్‌కు అత్యంత సన్నిహితుడైన "ఉత్తర అమెరికా తెలుగు సంఘం - తానా" అధ్యక్షుడు సతీష్‌ వేమన తోపాటు పలువురిని అమెరికన్ నేర విచారణ సంస్థ "ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌-ఎఫ్‌బీఐ" కూడా డ్రిల్ చేసి విచారించడంతో వీరి సిగ్గుమాలిన నిర్వాకంపై బయటపడి కలకలం చెలరేగింది. 



తానా నుంచి సినీతారలకు ఆహ్వానాలు, మెయిల్స్‌ వెళ్లడమే కాకుండా ఋజువుగా సతీష్ వేమన స్వంత బ్యాంకు అకౌంట్స్ నుంచి భారీ మొత్తంలో వారికి (సినీతారలకు) సొమ్ములు వెళ్లటం ఎఫ్‌బీఐ గుర్తించటంతో సతీష్ వేమన చుట్టూ ఉచ్చు గట్టి గానే బిగుసుకుంటోందని అప్పట్లో ప్రచారం జరిగింది.
Image result for TANA members
నిజానికి ఆరు నెలల క్రితం ఒక సినీ నటి వద్ద దొరికిన ఒక కాగితం ఆధారంగా దర్యాప్తు చేపట్టిన ఎఫ్‌బీఐ పలు కీలక ఆధారాలు సేకరించి పాత్రధారులైన మోదుగుమూడి కిషన్, చంద్రకళ దంపతులను అదుపులోకి తీసుకుంది. తెలుగు వారి ఆహ్వానం మేరకు అమెరికా వచ్చి సాంస్కృతిక ప్రదర్శనలు ఇవ్వడంతో పాటు విందు, వినోదాల్లో పాల్గొనడంలో తప్పులేదని, కానీ ఆ పేరుతో వచ్చి పచ్చి వ్యభిచారం చేయడమే పెద్ద నేరంగా ఎఫ్‌బీఐ భావిస్తోంది. 



"ఇంపర్సనైజేషన్" తో అంటే "ఒకరిని మరొక పేరుతో " విదేశీయులను తీసుకొచ్చి వారితో వ్యభిచారం చేయించడాన్ని తీవ్రంగా పరిగణించిన ఎఫ్‌బీఐ అమెరికా లోని తెలుగు అసోసియేషన్లు అన్నింటి నుంచీ సినీ తారలు, ప్రముఖులు అంటే తెలుగు సెలబ్రిటీస్ ఎవరెవరు వచ్చివెళ్లారు? ఏ కార్యక్రమానికి హాజరయ్యారు? హాజరై ఆ తరవాత ఏం చేశారు? అనే కోణాల్లో విచారణ చేపట్టినట్టు తెలుస్తోంది. 




తెలుగువారు అంటేనే ఇప్పుడు ఎక్కడపడితే అక్కడ అమెరికాలో నిఘాసంస్థలు అనుమానాస్పదం గా చూసే దుస్థితి బాబు మిత్రులవల్ల ఏర్పడింది. ఈ కేసులో తానా అధ్యక్షుడు సతీష్‌ వేమన, కోమటి జయరాంతోపాటు పలువురు "ప్రముఖులైన టీడీపీ ఎన్నారైలు" ఉన్నరని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు అమెరికా యాత్రలో భాగంగా టీడీపీ ఎన్నారైలు నిర్వహించిన సభలో కొందరు సినీతారల సెక్స్‌రాకెట్‌ నిర్వాహకులు ఉండటం సభికుల్లో తీవ్ర అసహనం కలిగించింది. దాంతో వారు తమ అసహనాన్ని అరుపులు, కేకల రూపంలో ముఖ్యమంత్రి ముందు బలంగానే వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: