టిఆర్ఎస్ పార్టీ అధినాయకుడు తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే రెండో సార్వత్రిక ఎన్నికల్లో అధికారం చేజారిపోకుండా పక్కా ప్లానింగ్ తో ఎలక్షన్ బరిలోకి దిగుతున్నారు. అయితే తనకు వ్యతిరేకంగా పుట్టిన మహా కూటమి గురించి పెద్దగా కెసిఆర్ ఏమి కలవరపడటం లేదంట. కానీ ప్రొఫెసర్ కోదండరాం స్థాపించిన తెలంగాణ జన సమితి పార్టీ పట్ల కెసిఆర్ చాలా ఆందోళనగా ఉన్నట్లు తెలంగాణ రాజకీయాల్లో టాక్.

Related image

దశాబ్దాల క్రితం కాంగ్రెస్ బిజెపి, టీడీపీ పార్టీలకు వ్యతిరేకంగా పుట్టిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ స్థానంలో..కోదండరాం స్థాపించిన పార్టీ తెలంగాణ ప్రజలలోకి చర్చకు పోతుందేమోనని తెగ ఆందోళన చెందుతున్నారట కెసిఆర్. దీంతో కేసీఅర్ కోదండరామ్, ఆయన స్థాపించిన టీజేఎస్ పార్టీపైనే పూర్తి దృష్టి పెట్టారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.

Image result for kcr kodandaram

పూర్వపార్టీలైన కాంగ్రెస్, టీడీపీ, బీజేపీకి వ్యతిరేకంగా ఏ తెలంగాణ నినాదంతో తమ టీఆర్ఎస్ పుట్టిందో అదే తెలంగాణ నినాదం, దోపీడి నినాదాలతో కోదండరామ్ పార్టీ ఎదిగిపోయే అవకాశాలనున్నాయని కేసీఆర్ ఆలోచిస్తున్నారు. ముందు ముందు జనాదరణ పొందితే టీఆర్ఎస్ స్థానంలో టీజేఎస్ మనుగడ సాగిస్తుందనే ఆందోళనలో ఉన్నారు.

Image result for kodandaram

అంతేకాకుండా ప్రభుత్వ వ్యతిరేకతకు తోడు ఒకప్పుడు కోదండరాం తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన వాడే అని ప్రజలు బలంగా నమ్మితే..భవిష్యత్తులో టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా కోదండరాం స్థాపించిన టీజేఎస్ పార్టీ తయారవుతుంది ఏమోనని తెగ భయపడుతున్నారట కేసీఆర్. ఈ నేపథ్యంలో కోదండరాం స్థాపించిన టీజేఎస్ పార్టీని పురిటిలోనే తొక్కేధమని కేసీఆర్ సరికొత్త ప్లాన్లు వేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో టాక్.




మరింత సమాచారం తెలుసుకోండి: