జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై గతంలో ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులకు ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్ ల మధ్య సోషల్ మీడియాలో పెద్ద వార్ యే జరిగింది. అయితే ఆ గొడవ సద్దుమణిగింది. ఈ క్రమంలో తాజాగా ఇటీవల ప్రకాశం జిల్లాలో పర్యటించిన కత్తి మహేష్ మరో సారి పవన్ కళ్యాణ్ పై అలాగే...తన రాజకీయ ఎంట్రీపై షాకింగ్ కామెంట్లు చేశారు.

Image result for pawan kalyan politics

ఈ సందర్భంగా కత్తి మహేష్ మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీలు..అలాగే రాజకీయ నాయకులు దళితులను ఓటు బ్యాంకుగా చూస్తున్నారని...దళిత జాతి కి తీవ్ర అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. నూతన దళిత నాయకత్వం కోసం తాను జిల్లాల పర్యటనలను చేస్తున్నట్లు మహేష్ కత్తి చెప్పారు.

Image result for pawan kalyan kathi mahesh

తాను ఏ పార్టీలోనూ చేరబోనని, దళిత హక్కులను పరిరక్షించే పార్టీకి మద్దతు ఇస్తానని ఆయన చెప్పారు. రాజకీయ నేతలు పరిణతి సాధించి ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రతి విషయంలోనూ వెనుకడుగు వేయడం జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు అలవాటు అని ఆయన అన్నారు.  

Image result for kattimahesh

ఇటువంటివి పవన్ కళ్యాణ్ పొలిటికల్ లైఫ్ లో..వ్యక్తిగత జీవితంలో చాలానే ఉన్నాయని అన్నారు. అంతే కాకుండా ఇటీవల మిర్యాలగూడ లో జరిగిన ప్రణయ్.. హత్య గురించి ప్రస్తావిస్తూ..ఇది పరువు హత్య కాదని...కుల ఉన్మాద హత్యలని అన్నారు. కచ్చితంగా మిర్యాలగూడలో ప్రణయ్ విగ్రహం స్థాపించాలని డిమాండ్ చేశారు.




మరింత సమాచారం తెలుసుకోండి: