చినబాబు నారా లోకేష్ అచ్చంగా తండ్రి చంద్రబాబునాయుడు అడుగుజాడల్లోనే నడుస్తున్నట్లు కనబడుతోంది. పిల్లనిచ్చిన మామగారికే అల్లుడు చంద్రబాబు ఏమి చేశారో అందరికీ తెలిసిందే. ఏదో అద్రుష్టం కొద్దీ ముఖ్యమంత్రయిపోయాడంటూ నరేంద్రమోడిని ఎద్దేవా చేస్తున్న చంద్రబాబు అప్పటికేదో తన సమర్ధత మీదే సిఎం అయినట్లు బిల్డప్ ఇస్తున్నారు. సిఎం కుర్చీలో నుండి నందమూరి రామారావును కూలదోసి మరీ పదవిని లాక్కున విషయం అందరికీ తెలిసిందే.

 

సరే అదంతా చరిత్రనుకోండి. ఇపుడు వర్తమానానికి వస్తే అదే పద్దతిలో మామగారు నందమూరి బాలక్రుష్ణకు అల్లుడు నారా లోకేష్ కూడా ఎర్త్ పెట్టటానికి రెడీ అయినట్లు పార్టీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. ఇంతకీ విషయం ఏమిటంటారా ? వచ్చే ఎన్నికల్లో ఏదో ఒక నియోజకవర్గం నుండి పోటీ చేయాలని చినబాబు లోకేష్ ఉవ్విళ్ళూరుతున్నారు. ఏదో ఒక నియోజకవర్గమంటే టిడిపి కచ్చితంగా గెలిచేదే అయ్యుండాలనే షరతు మీదే అనుకోండి.

 

ఇప్పటి వరకు తెలుగుదేశంపార్టీ  ఓటమెరుగని నియోజకవర్గాలంటే రేండే రెండున్నాయి. అవి చిత్తూరు జిల్లాలోని కుప్పం, అనంతపురం జిల్లాలోని హిందుపురం మాత్రమే. కుప్పం అంటే చంద్రబాబు నియోజకర్గమే. సంవత్సరాల తరబడి చంద్రబబు అక్కడి నుండే ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ఇక రెండో నియోజకవర్గం హిందపురంలో  ప్రస్తుతం మామగారు బాలయ్య ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కుప్పంలో పోటీ చేసే విషయంపైన ముందు లోకేష్ ఆలోచించారని ప్రచారం జరుగుతోంది లేండి.

 

అయితే, తండ్రిని నియోజకవర్గం మార్చటం కన్నా మామగారిని మార్చటం ఈజీ అని లోకేష్ అనుకున్నట్లు సమాచారం. అందుకనే హిందుపురంపై కన్నేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, తన సీటును త్యాగం చేయటం బాలయ్యబాబు కు ఇష్టం లేదు. అలాగని వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా గెలుస్తాడా ? అంటే అదీ డౌటే. ఎందుకంటే, నియోజకవర్గాన్ని అంతలా కంపు చేసేశారు. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో హిందుపురంలో టిడిపి ఓడిపోతే  ఆ పుణ్యం బాలయ్యదే అనటంలో సందేహం లేదు.


ఈ పరిస్ధితుల్లో లోకేష్  ఆ సీటుపై కన్నేశాడట. ఇంకోళ్ళయితే పరిస్ధితి ఎలాగుండేదో కానీ కన్నేసింది స్వయానా అల్లుడే కదా ? ఏం చేస్తారు ? ఇపుడా సమస్యే బాలయ్యను కలవరపెడుతోందట. తానే పోటీ చేస్తానని బాలయ్య పట్టుబడుతున్నా చంద్రబాబు సుముఖంగా లేరట. ఎందుకంటే, బాలయ్య గెలుస్తాడని కచ్చితంగా చెప్పలేరు. అలాగని సీటును ఎవరికీ వదులుకోవటం ఇష్టం లేదు. దాంతో హిందుపురం సీటు విషయంలో బాలయ్యబాబులో ఆందోళన పెరిగిపోతోందట. పరిస్ధితులు చూస్తుంటే మామగారు బాలయ్యకు అల్లుడు లోకేష్ ఎర్త్ పెట్టేట్ల ఉన్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: