వచ్చే ఎన్నికలు కమలనాధులకు ఎంత కీలకమో చెప్పనవసరంలేదు. ఉత్తరాదిన బాగా సీట్లు తగ్గుతాయని భావిస్తున్న నేపధ్యంలో ఆ లోటును దక్షిణాదిన భర్తీ చేసుకోవాలని బీజేపీ భావిస్తోంది ఇందుకోసం అనేక వ్యూహాలను  అమలు చేస్తోంది లేటెస్ట్ గా మరో ప్లాన్ ఆ పార్టీ బయటకు తీసింది. 


అక్కడ నుంచి :


ప్రధాని నరేంద్ర మోడీ 2019 ఎన్నికల్లో సికింద్రాబాద్ లోక్ సభ సీటు నుంచి పోటీ చేస్తారని టాక్ నడుస్తోంది. . ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ వారణాసి నుంచి మోడీ ఎంపీగా ఉన్నారు. 2014లో ఆయన గుజరాత్ నుంచి కూడా రెండవ సీటు పోటీ చేశారు. ఈసారి అదే ఫార్ములాతో సౌత్ లో పాగా వేయాలనుకుంటున్నట్లు భోగట్టా. దీనిపై పార్టీలో లోతైన చర్ఛ సాగుతోంది.


కసరత్తు షురూ :


దీనికి సంబంధించి తెర వెనక కసరత్తు మొదలైందని అంటున్నారు. సికింద్రాబాద్ సిట్టింగ్ ఎంపీ బండారు దత్తాత్రేయనే స్వయంగా మోడీని కలసి తన సీటు త్యాగం చేస్తూ ఆహానించారట. ఇక్కడ నుంచి ప్రధాని స్థాయి వ్యక్తి బరిలో ఉంటే ఆ ప్రభావం రెండు తెలుగు రాష్ట్రాల మీదన ఉంటుందని బీజేపీ వూహిస్తోంది. అప్పట్లో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ కూడా తెలంగాణాలోని మెదక్ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. అలాగే ఆమె కర్ణాటకలోని చిక్ మంగలూరు నుంచి కూడా పోటీ చేసి విజయం సాధిచారు. పార్టీకి జోష్ తెచ్చారు.


రెడీనా :


మోడీ, అమిత్ షాల కన్ను దక్షినాది మీదన ఇపుడు ఉంది. సీరియస్ పాలిటిక్స్ కి కూడా తెర తీశారు. కర్ణాటకలో బలంగా ఉన్న బీజేపీ, ఎన్నికల వేళకు తమిళనాడు లోనూ కూటమి కడుతుందని అంటున్నారు. ఏపీలో కూడా ఏదో మ్యాజిక్ చేస్తుందని, అందుకో భాగంగానే ప్రధాని మోడీ ఇక్కడ పోటీకి దిగుతారని చెబుతున్నారు. నిజంగా మోడీ పోటీ చేస్తే ఓ కొత్త ఊపు బీజేపీకి వస్తుందనడంలో సందేహం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: