ముందస్తు ఎన్నికల నేపధ్యంలో తెలంగాణాలో కూడా దివంగత ముఖ్యమంత్రి వైస్సాఆర్ నామస్మరణ మొదలైంది . గతంలో కూడా అప్పుడప్పుడు వైస్సార్ పేరు వినబడేది కానీ ఈ స్దాయిలో మాత్రం కాదు. ఏదో సందర్భం వచ్చినపుడు మాత్రమే వినిపించేంది. రానున్న ఎన్నికల నేపధ్యంలో వైఎస్సార్ పేరును జపం చేస్తే నాలుగు ఓట్లు పడతాయన్న ఉద్దేశ్యంతో కాబోలు కాంగ్రెస్ నేతలు నామజపం మొదలుపెట్టేశారు.

 

తెలంగాణా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి మ్యానిఫెస్టో కమిటి ఛైర్మన్ దామోదర్ రాజనరసింహ మాట్లాడుతూ, తెలంగాణాకు వైఎస్సార్ చేసిన సేవలను గుర్తు తెచ్చుకున్నారు.  వైఎస్సార్ ప్రవేశపెట్టిన పథకాలు, అమలు తీరును గురించి చాలా గొప్పగా  చెప్పారు. రైతు రుణమాఫీ, విద్యుత్ బకాయిల రద్దు, విద్యుత్ చార్జీల తగ్గింపు, ఆరోగ్యశ్రీ పథకం లాంటి గొప్ప పథకాలను అమలు చేసిన మహనీయుడంటూ దామోదర్ చెప్పుకోవటం ఆశ్చర్యంగా ఉంది.

 

అసలు వైఎస్సార్ గురించి చెప్పుకోవాల్సిన తెలంగాణా వైఎస్సార్ పార్టీ ఏమో ఎక్కడా మట్లాడటం లేదు. ముందస్తు ఎన్నికల వేడి పెరిగిపోతున్నా జగన్ మాత్రం తెలంగాణాలో ఎన్నికలను సీరియస్ గా తీసుకున్నట్లు కనపించటం లేదు. గతంలో పాదయాత్ర చేసిన వైఎస్ షర్మిలకు తెలంగాణ ప్రాంతాన్ని అప్పగిస్తారని జరిగిన ప్రచారం చివరకు ప్రచారం లాగే మిగిలిపోయింది. ఇటువంటి పరిస్దితుల్లో తెలంగాణాలో వైసిపి పోటీ విషయమై సందిగ్దత నెలకొంది.

 

నిజానికి వైఎస్సార్ కు తెలంగాణలో మంచి పట్టుంది. వైఎస్సార్ రెండు సార్లు ముఖ్యమంత్రవ్వటంలో తెలంగాణా పాత్ర బాగా ఉంది. అప్పట్లో తెలంగాణా ప్రాంతంలో కూడా వైఎస్సార్ కు వీరాభిమానులుండేవారు. వైఎస్సార్ తెలంగాణాలోని ఏ జిల్లాలో పర్యటించినా అభిమానులు విపరీతంగా వచ్చేవారు. ఇపుడు దామోదర్  అదే విషయాన్ని ప్రస్తావిస్తూ తాను వైఎస్సార్ కు వీరాభిమానిని అంటూ చెప్పుకోవటం గమనార్హం. మరి, వైఎస్సార్ పేరు తెలంగాణా ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఏమేర ఓట్లు రాబడుతుందో చూడాల్సిందే .

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

విజయవాడలో భార్యా బాధితుల సంఘం సమావేశం..

పెన్ N కౌంటర్....

కాదేదీ కవితకనర్హం అన్న చందాన.... రాజకీయాలకు ఏదీ ..ఎవరు అతీతం కాదని నిరూపించారు భార్య బాధితుల సంఘం వారు..విజయవాడలో సమావేశమైన వారి ప్రసంగం వారి మాటల్లోనే...

భార్యల కారణంగా అనేక ఇబ్బందులు పడుతున్నాము..

 

చట్టాలు అన్ని  భార్యలకు అనుకులంగా ఉన్నాయి...

 

భార్యల కారణంగా ఎంతోమంది జీవితాలు నాశనం అయ్యాయి..

 

అందుకె భార్య బాధితులు సంఘాన్ని ఏర్పాటు చేసాం...

 

రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు, ఆల్ ఇండియా భార్యా బాధితుల సంఘం ఏర్పాటు చేసుకున్నాము...

 

భార్యలే కాకుండా అత్త , అడపడుచులు, వదిన మరదళ్లు ,  తోడికోడళ్ల బాధితులు ఉన్నారు..

 

అందుకే మేమంతా కలిసి పొలిటీకల్ పార్టీ ఏర్పాటు చేస్తున్నాము..

 

త్వరలోనే

భార్యా బాధితులు, అత్త , అడపడుచులు, వదిన మరదళ్లు ,  తోడికోడళ్ల రాజకీయ పార్టీ ని ఏర్పాటు చేస్తున్నాము..

 

ఇప్పుడున్న రాజకీయ పార్టీలు ఎవరు మాకు మద్దతు ఇవ్వరు...

 

అందుకే సొంతంగా రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నాము..

 

 

 

 

 

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: