ఒకపుడు ఉత్తరాంధ్ర జిల్లాలు టీడీపీకి పెట్టని కోటలు, పోయిన ఎన్నికల్లోనూ అక్కడ జనం సైకెలెక్కేసారు. మెజరిటీ సీట్లు కట్టబెట్టారు. పసుపు పార్టీకి జై అన్నారు. విభజన తరువాత నాలుగేళ్ళైనా కూడా వెనకబాటుతం అలాగే ఉంది. దాంతో జనంలో భారీ మార్పు కనిపిస్తోంది. ఏకంగా విజయనగరం రాజుల కోటలోనే జగన్ కు వస్తున్న ఆదరణ మార్పునకు సూచన అని కూడా భావిస్తున్నారు.


జగన్ వెంట జనం:


గోదావరి జిల్లాలో మొదలైన జగన్ ప్రభంజనం విజయనగరంలోనూ కొనసాగుతోంది. అడుగు తీసి అడుగు వేస్తే  వెల్లువలా జనం అనుసరిస్తున్నారు. విజయనగంలోకి జగన్ పాదయాత్ర ఈ రోజు ప్రవేశించింది. భారీ ఎత్తున ప్రజానీకం స్వాగతం పలకడంతో వైసీపీ శ్రేణులు హ్యాపీగా ఉన్నాయి. చిన్నాపురం జంక్షన్ వద్ద జగన్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. 


హామీలు ఇస్తూ :


జగన్ తన పాదయాత్రలో భాగంగా భీమసింగి నుంచి మొదలుపెట్టి విజయనగం ముఖ ద్వారానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా అందరి సమస్యలు వింటూ హమీలు ఇస్తూ, ఓదారుస్తూ ముందుకు సాగిపోతున్నారు. జగన్ తన పాదయాత్రలో విశ్వ బ్రాహ్మణులకు హామీ ఇచ్చారు. ఇకపై తాళి బొట్టు తయారీ చేసేది వాళ్ళేనని, అలా చట్టం కూడా తెస్తామని ప్రకటించారు.
ఇక అగ్రి గోల్డ్ బాధితులకు బాసటగా ఉంటామని, తగిన న్యాయం చేస్తామని చెప్పారు. మరో వైపు కొత్త పెన్షన్  రద్దు చేస్తామని కూడా ఉద్యోగులకు హామీ ఇచ్చారు. జగన్ కి విజయనగరం జిల్లా బ్రహ్మ రధం పట్టడంతో వైసీపీలో కొత్త ఉస్తాహం కనిపిస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: