జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇప్పుడు ఎలాంటి రాజ‌కీయాలు చేస్తున్నారు?  వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి ఆయ‌న ఎలాంటి వ్యూహాలు ర‌చిస్తున్నా రు? మ‌రో ఆరు మాసాల్లోనే ఎన్నిక‌లు ఉన్న నేప‌థ్యంలో ఎలాంటి అడుగులు వేస్తున్నారు? వ‌ంటి కీల‌క విష‌యాలు ఇప్పుడు చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి. సాధార‌ణంగా తాను మార్పు తీసుకువ‌స్తాన‌ని, మ‌కిలి ప‌ట్టిన రాజ‌కీయాల‌ను దునుమాడ‌తాన‌ని ప్ర‌క‌టించారు., 2014 ఎన్నిక‌ల‌కు ముందుగానే పార్టీ పెట్టిన‌ప్ప‌టికీ.. ఏవేవో రాజ‌కీయ కార‌ణాల‌తో ఆయ‌న ఎన్నిక‌ల‌కు దూరంగా ఉండిపోయారు. చంద్ర‌బాబుకు మ‌ద్ద‌తిచ్చారు. బాబు లాంటి వ్యూహ క‌ర్త‌, అనుభ‌వ‌జ్ఞుడు లేనేలేడ‌ని, ఆయ‌న‌ను గెలిపించాల‌ని పెద్ద ఎత్తున పిలుపునిచ్చారు. క‌ట్ చేస్తే.. ఇప్పుడు అదే చంద్ర‌బాబుపై ప‌వ‌న్ నిప్పులు చెరుగు తున్నారు. అవినీతి పాల‌న చేస్తున్నార‌ని, దొంగ‌ల‌ను, కూనీకోరుల‌ను పెంచి పోషిస్తున్నార‌ని, ఆకు రౌడీలను ఆయ‌న ఎంక‌రేజ్ చేస్తున్నార‌ని విరుచుకుప‌డుతున్నారు. 


అంతేకాదు.. మ‌రో అడుగు ముందుకు వేసి.. త‌న‌పై దాడి చేసి ప్రాణాలు తీసేందుకు కూడా ప్ర‌ణాళిక సిద్ధం చేశార‌నే తీవ్ర వ్యాఖ్య‌లు కూడా చేశారు. ఈ క్ర‌మంలోనే ‘‘నేను సినిమా హీరోను కాను. ఉద్యమకారుడిని. పద్నాలుగేళ్ల వయసు నుంచే రాజకీయాలను అర్థం చేసుకుంటున్నా. మీవి విడిపోయిన రెండు వేళ్లు. మాది ఐదు వేళ్లూ బిగించిన పిడికిలి. మీ పద్ధతి మార్చుకోండి. బెదిరింపులు మానండి. లేదంటే దెబ్బకు దెబ్బ తీస్తాం పిచ్చి కుక్కల్లారా’’ అంటూ చంద్ర‌బాబు పార్టీపై విరుచుకుపడ్డారు. అదేస‌మ‌యంలో.. ‘‘మనపై బెదిరింపులు పెరుగుతున్నాయంటే మనం బలం పుంజుకున్నామని అర్థం. మనం రాష్ట్రంలో ఉన్న మిగిలిన రెండు పార్టీలతో దీటుగా నిలబడుతున్నామని అర్థం’’ అని ఎవ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇచ్చారు. తనకు రక్షణ కల్పిస్తామని ప్రభుత్వం చెప్పడంపై స్పందించారు. 


‘‘భయం ఉంటే రాజకీయాల్లోకే వచ్చేవాడిని కాను. సమస్యలపై పోరాడేందుకు ముందుకు వచ్చిన జనసేనానికి భయం ఎలా ఉంటుంది? 18 ఏళ్ల వయసులోనే సాయుధ పోరాటం చేయడానికి సిద్ధపడిన వాడిని’’ అని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం ద్వారా.. అస‌లు తాను ఏం చేయాల‌ని రాజ‌కీయాల్లో వ‌చ్చాడో చెప్ప‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.  రక్షణ పేరిట తనపై నిఘా పెట్టారని... అందుకే పోలీసులను వెన క్కి పంపించేశానని చెప్పాడు. ‘‘సెక్యూరిటీ పేరిట నిఘా పెడితే, నా గురించి రోజుకు 2000 మెసేజ్‌లు పంపుతుంటే వారిని రక్షక భటులని నేనెలా అనుకోగలను?’’అని ప్రశ్నించాడు. అయితే, నిజానికి ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌పై విశ్లేష‌ణ‌లు పెద్ద ఎత్తున వ‌స్తున్నాయి.

ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో ప‌వ‌న్ సంచ‌ల‌నాల‌కు తెర‌దీశాడ‌ని, ప్ర‌జ‌ల దృష్టిని త‌న‌వైపున‌కు మ‌ళ్లించుకునేందుకు ఇదొక ఎత్తుగ‌డ‌ని కొంద‌రు అంటుంటే.. చంద్ర‌బాబు స‌హా టీడీపీ నేత‌ల‌పై ఇప్ప‌టి వ‌ర‌కు జ‌గ‌న్ మాత్ర‌మే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసి సెంట్రాఫ్‌ది టాపిక్ అయ్యార‌ని, అయితే, ఆ ప్లేస్‌లోకి తాను వ‌చ్చేందుకు ఇలా ప‌వ‌న్ వ్యాఖ్యానిస్తున్నాడ‌ని అంటున్నారు. ఆయుధం ప‌ట్టేందుకు అయితే, బ్యాలెట్ పోరు ఎందుక‌ని ప్ర‌శ్నిస్తున్న నెటిజ‌న్లు కూడా ఉండ‌డం గ‌మ‌నార్హం. ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించాల్సిన ప‌వ‌న్ .. ఇలా చౌక‌బారు విమ‌ర్శ‌లు చేయ‌డం దారుణ‌మ‌నే వారు కూడా ఉన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: