ఓటుకునోటు కేసు విచారణలో భాగంగా ఐటి సోదా పేరుతో పెద్ద ట్విస్టు ఒకటి చోటు చేసుకుంది. విచారణలో భాగంగా ఈరోజు ఐటి అధికారుల విచారణకు హాజరైన ఓ నిందుతుడు ఉదయసింహ ఆ ట్విస్టును వెల్లడించారు. ఉదయసింహ వెల్లడించిన వివరాలతో ఐటి ఉన్నతాధికారులే ఆశ్చర్యపోయారు. ఇంతకీ ఉదయసింహ చెప్పిన ట్టిస్టు ఏమిటంటే, నాగోల్ లోని తన బంధువు రణధీర్ ఇంట్లో ఆదివారం భారీ దొంగతనం జరిగింది. ఆ దొంగతనానికి ఐటి ఉన్నతాధికారులకు ఏంటి సంబంధం అనుకుంటున్నారా ?

 

చదవండి మీకే తెలుస్తుంది. ఆదివారం రాత్రి సుమారు 9 గంటల ప్రాంతంలో సుమారు 20 మంది ఐటి అధికారులు రణధీర్ ఇంటికి వచ్చారు. తాము ఐటి విభాగం నుండి వచ్చినట్లు చెప్పి ఇల్లంతా గాలింపు మొదలుపెట్టారు. తన బంధువు ఉదయసింహ పై ఐటి ఉన్నతాధికారులు దాడులు జరిపి సోదాలు చేసిన విషయం రణధీర్ కు తెలుసు. విచారణ పేరుతో బంధువుల ఇళ్ళపైన కూడా దాడులు  చేస్తారన్న విషయం తెలుసు. కాబట్టే రణధీర్ కూడా ఐటి విభాగం ఉన్నతాధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు.  

 

ఎలాగూ ఐటి సోదాలు జరుగుతున్నాయి కాబట్టి వారడిగిన వివరాలు చెప్పారు. అలాగే వారు ఇల్లంతా వెతికారు. డబ్బు, నగలు, డాక్యుమెంట్లు అన్నింటికి లెక్కలు తీశారు. చివరకు కంప్యూటర్లు, హార్డ్ డిస్కుల్లాంటివి తీసుకుని సోదాల్లో బయటపడిన డబ్బు, నగలు అన్నింటినీ తీసుకుని కొన్ని డాక్యుమెంట్లపై సంతకాలు చేయించుకుని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయేముందు సోమవారం ఐటి శాఖకు వచ్చి  నగలు, డబ్బు, డాక్యుమెంట్లను తీసుకెళ్ళాల్సిందా చెప్పి మరీ వెళ్ళారు.

 

సీన్ కట్ చేస్తే సోమవారం ఉదయ రణధీర్ ఐటి శాఖ కార్యాలయంకు చేరుకున్నారు. తన బంధువు ఉదయసింహ కూడా అక్కడే ఉన్నారు. జరిగిన విషయం మొత్తం ఉదయసింహకు చెప్పారట. దాంతో ఇద్దరు కలిసి ఐటి శాఖ ఉన్నతాధికారులను కలవగా తామసలు ఆదివారం ఎటువంటి దాడులు చేయలేదని స్పష్టం చేశారట. జరిగిన దాడులకు తమకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారట. దాంతో ఐటి అధికారుల పేరుతో తమను ఎవరో మోసం చేశారంటూ రణధీర్ ఇపుడు లబోదిబోమంటున్నారు. ఇంట్లో జరిగిన దొంగతనం గురించి చైతన్యపురి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దొంగలు ఎంత తెలివి మీరిపోయారో ?

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

పాదయాత్ర ముగింపు దశకు వస్తున్న నేపధ్యంలో కూడా ఇతర పార్టీలకు చెందిన పలువురు నేతులు వైసిపిలో చేరుతున్నారు. విజయనగరం జిల్లాలో ఈరోజు పాదయాత్ర చేస్తున్న జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పలువురు భారతీయ జనతా పార్టీ నేతలు వైసిపిలో చేరారు. జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి ముద్దాడ మధు, మహిళా మోర్చా నాయకురాలు రమణి వైసిపి కండువా కప్పుకున్నారు.  వీరితో పాటు మరో 200 మంది కూడా పార్టీలో చేరారు లేండి.

 

 

జిల్లాకు చెందిన పలువురు బీజేపీ నాయకులు సోమవారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. బీజేపీ విజయనగరం జిల్లా ప్రధాన కార్యదర్శి ముద్దాడ మధు, మహిళా మోర్చా నాయకురాలు రమణిలు జిల్లాలో ప్రజాసంకల్పయాత్ర చేస్తున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌ సీపీలో చేరారు. పార్టీ కండువాలతో సాదరంగా వైఎస్‌ జగన్‌ వారిని పార్టీలోకి ఆహ్వానించారు. వారితో పాటు 200 మంది బీజేపీ కార్యకర్తలు కూడా వైఎస్సార్‌ సీపీలో చేరారు. అనంతరం మధు మాట్లాడుతూ.. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన పాదయాత్ర దేశ రాజకీయాల్లో మరెవ్వరికి సాధ్యం కాని ఘనత అని తెలిపారు. వైఎస్‌ జగన్‌కు లభిసున్న ప్రజాదరణ అపూర్వం అని పేర్కొన్నారు. నాలుగేళ్లుగా విజయనగరం జిల్లాలో టీడీపీ నేతలు చేసిన అభివృద్ధి శూన్యమని మండిపడ్డారు.


మరింత సమాచారం తెలుసుకోండి: