మహాత్ముడు తన జీవితకాలంలో మూడు పర్యాయాలు అంధ్రప్రదేశ్ కి వచ్చారు. ఇక్కడ ప్రజలతో మమేకం అయ్యారు. వారితో కలసిపోయి ఉత్సాహం తెచ్చారు. ఆయనకు ఆంధ్రులంటే ప్రత్యేకమైన అభిమానం. వారు త్యాగం కలిగిన వారని, ఉదారత, నిజాయతీ ఉన్నవారని గాంధీ భావించేవారు. తెలుగు వారి పట్ల ఆయనకు ఎంతో ప్రేమాభిమానలు ఉండేవి.


ఆకట్టుకున్నారన్న బాపూజీ :


తనను తెలుగువారు బాగా ఆకట్టుకున్నారని గాంధీజీ చెప్పుకున్నారు. ఆయన 1915 లో నెల్లూరు, బెజవాడలో  పర్యటన‌ను, ఆలాగే 1921 ఏప్రిల్ నెలలో బెజవాడ కాంగ్రెస్ సదస్సుకు, 1933లో విశాఖ సహా ఏపీలో పలు ప్రాంతాల పర్యటనకు వచ్చారు. ఆయా సమయాల్లో బాపూజీ తెలుగువారి పట్ల తనకు గల అభిప్రాయాన్ని చెప్పారు. ఆభరణాల పట్ల మక్కువ ఎక్కువైనా తాను వచ్చి విరాళాలు అడిగితే మాత్రం చేతికి ఎముక లేనట్లుగా తీసి ఇచ్చేశారని గాంధీజీ చెప్పేవారు.  ఎటువంటి పోరాటాలకు పిలుపు ఇచ్చినా కూడా తెలుగువారి వెరవక ముందుకు దూసుకు వచ్చి ఉద్యమించారని ఆయన ప్రశంచించారు.


ప్రత్యేక ఆంధ్రకు మద్దతు :


ఆ టైంలో అంధ్ర రాష్ట్రం మద్రాస్ స్టేట్లో భాగంగా ఉండేది. దాంతో సెపరేట్ స్టేట్ కావాలని ఉద్యమం మొదలైంది. దానికి మద్దతు ప్రకటించిన గాంధీజీ ఆనాటి కాంగ్రెస్ నాయకుడు దాక్టర్ సర్వేపల్లి రాధాక్రిష్ణన్ కి లేఖ రాస్తూ మీ ఆకాంక్ష  నెరవేరాలని నిండు మనసుతో కోరుకున్నారు. ఆ తరువాత 1938లో కాంగ్రెస్ కూడా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం తీర్మానం కూడా చేసింది.


విశాఖ అందమైనది :


ఇక బాపూజీ జీవితంలో మరో ఘట్టం ఆయన ఓ పర్యాయం ట్రైన్లో  మద్రాస్ వెళ్తూ మధ్యలో ఇరవై నిముషాల పాటు రైల్ హాల్ట్ ఇవ్వడంతో వాల్తేర్ స్టేషన్లో ఆగారు. అపుడు ఆయన విశాఖ గురించి తెలుసుకుని, చూసి ఆనందించారు. . ఇక ఆదే టైంలో తన అనుచరుడైన మహమద్ ఆలీ ని విశాఖలో బ్రిటిష్ పోలీసులు అరెస్ట్ చేసిన వార్త విన్న బాపూజీ ఏమన్నారో  తెలుసా. ఇక్కడ జైలు జీవితం నీకు వరం. ఎందుచేతనంతే విశాఖలో వున్నావు, అందమైన ప్రాంతంలో ఉన్నావు. హ్యాపీగ ఉండు అంటూ సందేశం పంపారు. ఇక తన టూర్లో భాగంగా గాంధీ విశాఖలోని ఆనటి ప్రదేశాలను తిలకించి పులకించిపోయారు.


 ఇక భీమునిపట్నంలో గాంధీని సన్మానించి చేతి కర్ర బహూకరిస్తే దానికి బాపూజీ సమాధానం ఏంటంటే ఈ చేతి కర్ర నేను తప్పులు చేయకుండా జాగ్రత్తగా చూస్తుందని. ఎంతైనా ఆయన మహాత్ముడు.. ఈ జాతికి పిత. ఒక్కటి మాత్రం నిజం గాంధీ పుట్టిన దేశం. రఘు రాముడు ఏలిన రాజ్యం చరిత్రల సువర్ణాధ్యాయం.


మరింత సమాచారం తెలుసుకోండి: