వైఎస్ జగన్. నిండు కుండ అంటారు సన్నిహితులు. ఒక పట్టాన భావావేశాలను బయటపెట్టుకోరంటారు. ఆయన పోరాట రీతి, నీతి కూడా అలాంటిదే. మనసులో ఎంత బాధ ఉన్నా కూడా బయటకు మాత్రం చిరు నవ్వుతోనే కనిపిస్తారు. అటువంటి  జగన్ లోని బడబాగ్ని బద్దలవుతోందా. ఆ ఒక్క కారణంతోనే ఆయన డిస్టర్భ్ అయ్యారా. అంటే పరిణామాలు చూస్తూంటే అవుననే అనిపిస్తోంది.


ఆ కేసు ప్రస్తావన :


జగన్ తనపైన ఎన్నో కేసులు పెట్టినా ఏ రోజూ మీడియా  ముందు  పెద్దగా  ప్రస్తావించలేదు. నిజంగా వాటిని  అనుభవించారు,  బాదలన్నీ పళ్ళ బిగువున. అటువంటి  జగన్ కదిలిపోయింది  ఓకే ఒకేసారి. అదే తన భార్య భారతి మీద ఈ మధ్యన ఈడీ కేసు ఫెయిల్ చేసినపుడు మాత్రమే. దానికి ఆ వెంటనే ఆయన బాగా రియాక్ట్ అయి ట్విటర్ ద్వారా తన ఆవేదనను పంచుకున్నారు. ఇంత నీచమా రాజకీయాలు అంటూ ఆక్రోసించారు. ఆ తరువాత మళ్ళీ ఇపుడిలా బయటపడ్డారు.


భారీ జనం మధ్యన :


తనపై చంద్రబాబు తరచూ బీజేపీతో కుమ్మక్కు అంటూ బండలు వేయడాన్ని జగన్ భరించలేకపోతున్నారు. దాన్ని ప్రతీ మీటింగులోనూ తిప్పికొడుతున్నా పదే పదే బాబు మాత్రం అదే విమర్శ చేస్తున్నారు. దాంతో తట్టుకోలేకపోయారో మరేమో కానీ విజయనగరం సభలో మాత్రం జగన్ బయటపడిపోయారు. నేనే బీజేపీతో కుమ్మక్కు అయితే నా భార్య మీద ఎందుకు కేసులు పెడతారంటూ సూటిగా ప్రశ్నించారు.
తిరగతోడారు :


పాత కేసు, ఎపుడో ఎనిమిదేళ్ళ నాటి దాన్ని తిరగతోడారంటేనే అర్ధం చేసుకోవచ్చు నేను కుమ్మక్కు అయ్యానో లేదో అంటూ జగన్ కుండ బద్దలు కొట్టారు. బాబు బీజేపీతో, కాంగ్రెస్ తో లాలూచీ రాజకీయాల గురించి కూడా జగన్ జనాలకు తెలిపారు. కానీ ఇక్కడ చెప్పుకోవాల్సింది మాత్రం భారతి కేసు గురించే. జగన్ ఈ విషయంలో ఇప్పటికీ  చాలా బాధ పడుతున్నారని మరో మారు ఈ మీటింగ్ లో చెప్పడం ద్వారా తెలుస్తోంది. మొత్తానికి ఆ కేసు నిలువెత్తు పొరాటమైన జగన్ ని బాగా డిస్టర్బ్ చేసిందనే చెప్పాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: