ఉత్తరాంధ్ర జిల్లాల్లో తొలి అభ్యర్ధిని వైసీపీ ప్రకటించింది. గత యాభై రోజులుగా ఇక్కడ పాదయాత్ర చేస్తున్న జగన్ మొదటిసారి  అధికారికంగా ఒక పేరుని ఎమ్మెల్యే అభర్ధిగా డిక్లేర్ చేశారు. ఆయనే కోలగట్ల వీరభద్ర స్వామి. విజయనగరం అసెంబ్లీ సీటు నుంచి వచ్చే ఎన్నికల్లో స్వామి వైసీపీ అభ్యర్ధి అంటూ నిండు సభలో జగన్ వెల్లడించారు. దీంతో స్వామికి రూట్ క్లియర్ అయింది.


జైంట్ కిల్లర్ !


కోలగట్ల వీరభద్రస్వామి  జైంట్ కిల్లర్. దశాబ్దాల పాటు విజయనగరం అసెంబ్లీ నుంచి ఓటమి ఎరగని వీరుడు పూసపాటి అశోక్ గజపతి రాజునే ఓడించిన ఘనుడాయన. 2004 ఎన్నికల్లో అశోక్ దారుణంగా ఓడిపోయారు. అదీ ఇండిపెండెంట్ గా పోటీ చేసిన స్వామి చేతుల్లో. అప్పట్లో కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోవడంతో స్వామి ఒంటరిగా బరిలోకి దిగి అశోక్ ని ఓడించేసారు. జైంట్ కిల్లర్ అనిపించేసుకున్నారు. ఏపీవ్యాప్తంగా సంచలనం స్రుష్టించారు.


విక్టరీ ష్యూరేనా !


ఆ తరువాత ఆయన మరో విజయం కోసం చాల ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. స్వామి కాంగ్రెస్ నుంచి వైసీపీలో చేరి ఇపుడు ఎమ్మెల్సీగా ఉంటున్నారు. జగన్ ఆయనను ఎమ్మెల్యే క్యాండిడేట్ గా డిక్లేర్ చేయడం వెనక ఆయన గెలుపుపై ధీమా బాగానే  కనిపిస్తంది. మరి దాన్ని స్వామి నిజం చేస్తారా. ఎందుకంటే జిల్లా వైసీపీలో గ్రూపులు బాగా ఉన్నాయి.


ఆ వర్గం ఏం చేస్తుంది :


ఈసారి విజయనగరంతో సహా చాల నియోజకవర్గాల్లో సీట్లు తమ వారికి ఇప్పించుకోవాలని బొత్స  సత్యనారాయణ కసరత్తు చేస్తున్నారని ప్రచారం సాగింది. కోలగట్ల బొత్స‌ కు వ్యతిరేకంగా ఉంటున్నారు. రెండు వర్గాలు విడిగానే పార్టీ ప్రోగ్రాంస్ ని నిర్వహిస్తున్నాయి. ఈ టైంలో కోలగట్లకు టికెట్ రావడం పట్ల బొత్స  వర్గం ఎలా రియాక్ట్ అవుతుందన్నది తేలాలి. 

ఒకవేళ వారు సహకరిస్తే బంపర్ మెజారిటీ ష్యూర్. తగవులు ఆడుకుంటే మాత్రం ఇక్కడ పార్టీ నష్టపోతుంది. మరి అధినేత జగన్ కి ఈ విషయాలు తెలియనివి కావు. ఆయన సర్దిచెబితే జిల్లాలో ఫస్ట్ సీటు విక్టరీ విజయనగరమేనని పార్టీ వర్గాలు బల్ల గుద్ది చెబుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: