రాజ‌కీయాల్లో ఉన్న వారు నోరు పారేసుకున్నారంటే.. వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారంటే.. కార‌ణం లేకుండా పోదు. ముఖ్యంగా జ‌గ‌న్ వంటి అత్యంత కీల‌క నేత‌ల‌పై వ్యాఖ్య‌లు చేయ‌డం, వివాదాస్ప‌ద కామెంట్లు కుమ్మ‌రించ‌డం అంటే మాట‌లు కాదు. కానీ, జెడ్పీ చైర్మ‌న్ హోదాలో ఉన్న నెల్లూరు నాయ‌కుడు బొమ్మిరెడ్డి రాఘ‌వేంద్ర‌రెడ్డి మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ జ‌గ‌న్‌పై చేయ‌ని సంచ‌ల‌న కామెంట్లు చేసి రాజ‌కీయాల‌ను వేడెక్కించారు. అయితే, ఇది ఆయ‌నంత‌ట ఆయ‌న చేసిన కామెంట్లేనా? ఆయ‌న అంత పెద్ద పెద్ద వ్యాఖ్య‌లు చేసే పొజిష‌న్‌లో ఉన్నాడా?  దీనివెనుక ఎవ‌రూ లేరా? అంత తేలిక‌గానే ఆయ‌న రాజ‌కీయ వ్యాఖ్య‌లు చేశారా? అంటే.. తాజాగా వెలుగు చూస్తున్న ప‌రిణామాల‌నుబ‌ట్టి.. ఆయ‌న వెనుక పెద్ద నేత‌ల హ‌స్తం ఉంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. 


కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన సీనియ‌ర్ రాజ‌కీయ దిగ్గ‌జం, మాజీ మంత్రి ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డికి ఉద్వాస‌న ప‌ల‌కా ల‌ని నిర్ణ‌యించుకున్న‌ప్పుడే.. టీడీపీ నేత‌లు బొమ్మిరెడ్డిపై చ‌ర్చించార‌ని, ఆయ‌న‌ను పార్టీలోకి తీసుకోవాల‌ని నిర్ణ‌యించు కున్న‌ట్టు స‌మాచారం. ఈ క్ర‌మంలోనే ఆనంను నిర్ల‌క్ష్యం చేశార‌ని కూడా అంటున్నారు. ఆయ‌న‌ను పొగ‌బెట్టి.. త‌ద్వారా బొమ్మిరెడ్డికి ఆహ్వానం ప‌ల‌కాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుస్తోంది. అయితే, ఈ ప‌క్కా వ్యూహాన్ని అత్యంత జాగ్ర‌త్త‌గా నిర్వ‌హించిన ఓ సీనియ‌ర్‌ మంత్రి ఆనం అడుగు జాడ‌ల‌ను, ఆయ‌న నిర్ణ‌యాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ప‌ర్య‌వేక్షించారు. 


ఆయ‌న వైసీపీలోకి చేర‌డ‌మే ఆల‌స్యంగా ఈ వ్యూహానికి ప‌దును పెట్టార‌ని, ఈ క్ర‌మంలోనే బొమ్మిరెడ్డిని అస్త్రంగా వాడుకున్నార‌ని స‌మాచారం. నీకు జ‌గ‌న్ టికెట్ ఇవ్వ‌క‌పోయినా.. మేం ఉన్నాం. నువ్వేం కంగారు ప‌డ‌క్క‌ర్లేదు! అని స‌ద‌రు మంత్రి బొమ్మిరెడ్డికి హామీ ఇచ్చార‌నే వ్యాఖ్య‌లు తాజాగా తెర‌మీదికి వ‌చ్చాయి. ఆయ‌న అండ చూసుకునే బొమ్మిరెడ్డి రెచ్చిపోయార‌ని తెలుస్తోంది. వాస్త‌వానికి ఏ పార్టీలో అయినా గెలుపు గుర్రాలుగా భావించే వారికే టికెట్లు ల‌భిస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే ఆనంను జ‌గ‌న్ చేర‌దీశారు. అయితే, బొమ్మిరెడ్డి నాలుగేళ్ల క‌ష్టాన్ని వృధా చేయ‌రాద‌నే ఉద్దేశంతో ఆయ‌న‌కు ఎమ్మెల్సీ టికెట్‌తో పాటు అధికారంలోకి వ‌చ్చాక మ‌రింత మంచి ప‌ద‌వి కూడా ఇచ్చి ఆయ‌న సేవ‌ల‌ను వినియోగించాల‌ని జ‌గ‌న్ నిర్ణ‌యించుకున్నారు. 

Image result for స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి

ఒకే సామాజిక వ‌ర్గం కావ‌డంతో ఆయ‌న‌కు గౌర‌వప్ర‌ద‌మైన ప‌ద‌వి ఇవ్వాల‌ని కూడా భావించారు. ఇదే విష‌యాన్ని ఆయ‌న ఫోన్ ద్వారా బొమ్మిరెడ్డికి చేర‌వేయాల‌ని సూచించారు. అయితే, టీడీపీ ట్రాప్‌లో ప‌డిన బొమ్మిరెడ్డి.. వైసీపీ నాయ‌కుడు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి ఫోన్ చేసినా లిఫ్ట్ చేయ‌లేదు. మొత్తానికి బొమ్మిరెడ్డి వ్యాఖ్య‌ల వెనుక టీడీపీ మంత్రి హ‌స్తం ఉంద‌నే విష‌యం ఆల‌స్యంగా వెలుగు చూడ‌డం గ‌మ‌నార్హం.



మరింత సమాచారం తెలుసుకోండి: