రానున్న 2019లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్  పార్లమెంట్ స్థానం నుండి దక్షిణాది ప్రతినిధిగా కూడా ప్రధాని నరేంద్ర మోదీ పోటీచేస్తారనే విషయంలో అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆయన దక్షిణాది రాష్ట్రాల్లో పోటీ చేసి ఇక్కడ భారతీయ జనతా పార్టీ గాలి వీచేలా వాతావరణాన్ని మార్చే అవకాశం పరిశీలనలో ఉందన్న వాదన కొన్నాళ్లు గా వినిపిస్తోంది. ఆఅయన ఎక్కడి నుంచి పోటీ చేయాలి అన్నదానిపై దత్తత్రేయ ఒక సలహా కూడా ఇచ్చినట్లు తెలుస్తుంది.

Image result for narendra modi dattatreya

అయితే దీనిపై బీజేపీ అధిష్ఠానం నిర్ణయం ఎలా ఉందో?  ఏమో? కానీ, బీజేపీకి చెందిన మాజీ కేంద్ర మంత్రి దత్తాత్రేయ మాత్రం, నమో ని తన నియోజకవర్గం నుంచి పోటీ చేయమని ఆహ్వానించారట. సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీ చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ప్రస్తుతం ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బండారు దత్తాత్రేయ ఆహ్వానించి నట్లు బీజేపీలో ప్రచారంలో ఉంది.

Image result for narendra modi contested from secunderabad parliamentary constituency

దత్తాత్రేయ ఇటీవల బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాను కలిసినప్పుడు ఈ ప్రతిపాదన చేసినట్లు బిజెపి వర్గాలు చెబుతున్నాయి. ఫ్రధాని నరేంద్ర మోదీ సికింద్రాబాద్ లోక్‌సభ నియోజక వర్గం నుండి పోటీచేయటం వలన మొత్తం దక్షిణాదిలోని అన్ని రాష్ట్రాలపై దాని ప్రభావం పడుతుందని అంటున్నారు. దక్షిణాదిన ఈ వ్యూహం బిజెపి వ్యాప్తికి అతి దగ్గరి దారని పార్టీకి బాగా కలిసి వస్తుందని ఎంపి బండారు దత్తాత్రేయ వాదిస్తున్నట్లు సమాచారం.  కాగా దత్తన్నగారి ఈ అభిప్రాయానికి తెలంగాణ బీజేపీలో కూడా మద్దతు దొరికిందని సమాచారం.

Image result for narendra modi contested from secunderabad parliamentary constituency

తెలంగాణా ముద్దుబిడ్డ పీవీ నరసింహరావు తరువాత ఇంకెవరూ దక్షిణాది రాష్ట్రాలనుంచి ప్రధాని పదవికి పోటీచేయలేదు. ఆయన ప్రధాన మంత్రి పదవి చేపట్టిన తరువాత నంద్యాల నియోజకవర్గం నుండి పోటీ చేసి అతి భారీ మెజారిటీతో విజయం సాధించారు. అంతకుముందు గతంలో మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ తెలంగాణలోని మెదక్, కర్నాటక లోని చిక్‌మగళూరు నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు.

Image result for pv narasimha rao

అయితే, గతఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించి పెట్టిన ఉత్తరప్రదేశ్ ఇప్పుడు బీజేపీకి అంత అనుకూలంగా లేకపోవడంతో నరేంద్ర మోదీ అక్కడి నుంచే పోటీ చేసి పరిస్థితులను కూడా బీజేపీ అనుకూలంగా మార్చేందుకు ప్రయత్నించ వచ్చని కూడా  తెలుస్తోంది. మరోవైపు ఒడిశా లోని పూరీ నుంచి కూడా నరెంద్ర మోదీ పోటీచేయ వచ్చని చాలా కాలంగా ప్రచారంలో ఉంది. తుడి నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి?

Image result for secunderabad parlament constituency 

మరింత సమాచారం తెలుసుకోండి: