ఎవరు పిలిచారో, ఎందుకు పిలిచారో కానీ పోలోమంటూ దాదాపుగా పాతిక మంది వరకూ వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి ఫిరాయించారు. వెళ్ళిన వారిలో నలుగురు మంత్రులూ అయిపోయారు. ఇపుడు ఎన్నికల ముచ్చట ముంగిట్లోకి వచ్చేసరికి మాత్రం ముచ్చెమటలు పడుతున్నాయి. టికెట్ల ఇక్కట్లు వారిని వేధిస్తున్నాయి. పసుపు పార్టీ హ్యాండ్ ఇచ్చేలా కనిపిస్తోందట.


తమ్ముళ్ళకేనట :


టీడీపీలో మొదటి నుంచి ఉంటున్న తమ్ముళ్ళకే టికెట్ల విషయంలో ఇంపార్టెన్స్ ఇవ్వాలని బాబు డిసైడ్ అయినట్లుగా న్యూస్ వైరల్ అవుతోంది. అసెంబ్లీ సీట్లు పెరిగితే ఒకే. అందరికీ చాన్స్ ఉంటుంది. ఒకవేళ పెరగకపోతే మాత్రం  ఆసలైన టీడీపీ వారికే ఎమ్మెల్యే టికెట్లు వస్తాయట. దాంతో ఖంగు తినడం ఫిరాయింపు ఎమ్మెల్యేల వంతు అవుతోంది.


అక్కడ నుంచి:


ప్రకాశం జిల్లా అద్దకి నుంచి మొదలు పెట్టిన ఈ ఆపరేషన్ తో  ఫిరాయింపు ఎమ్మెల్యేల‌కు పరేషన్ అవుతోందట. అక్కడ వైసీపీ నుంచి ఫిరాయించి సైకిలెక్కేసిన గొట్టిపాటిని కాదని కరణం ఫ్యామిలీకి   బాబు పచ్చ జెండా ఊపేశారు. దాంతో గొట్టిపాటి అద్దంకిని ఇక మరచిపోవాల్సిందేనట. ఆయన మరీ డిమాండ్ చేస్తే గుంటూర్ జిల్లాకు షిఫ్ట్ చేస్తారని టాక్ నడుస్తోంది. సో గొట్టిబాటికి భలే షాక్ తగిలేసింది అంటున్నారు.


అదే సీన్ :


ఇక కర్నూల్ జిల్లాలోనూ ఇదే సీన్ రిపీట్ అవుతుందని అంటున్నారు. మంత్రి అఖిలప్రియకు నో చాన్స్ అంటున్నారు. ఆమెని పక్కన పెట్టి వేరే వాళ్ళను వెతుకుతున్నారు. ఆమె మేనమామ ఎస్వీ మోహనరెడ్డి విషయం తీసుకుంటే ఎంపీ టీజీ వెంకటేష్ గట్టిగా గోల చేస్తే ఆయన సీటుకు ఎసరు తప్పదంటున్నారు. కడప మంత్రి ఆదినారాయణరెడ్డి ని కూడా సైడ్ చేసే అవకాశలు లేకపోలేదంటున్నారు.  అలాగే ఉత్తరాంధ్ర సహా చాలా చోట్ల జంపింగ్ జఫాంగ్ ఎమ్మెల్యేలకు షాక్ ట్రేట్మెంట్ ఉంటుందని టాక్.


అదీ ధైర్యం :


సీట్లు ఇవ్వకపోయినా ఫిరాయింపులు వైసీపీలోకి తిరిగి పోలేరు. ఎట్టి పరిస్తితుల్లోనూ జగన్ వారిని తీసుకోడు. ఇదీ అసలైన ధైర్యంగా కనిపిస్తోందని అంటున్నారు. జనసేనలో చేరినా పెద్దగా ప్రమాదం ఉండదు. అదే ఫిరాయింపులకు పెద్ద పీట వేస్తే అసలు తమ్ముళ్ళు  జారిపోతారు. వారికి వైసీపీ బెస్ట్ ఆప్షన్ గా ఉంటుంది. జగన్ సైతం కండువా కప్పేయడానికి రెడీగా ఉంటారు. సో. ఇక్కడే బాబు మార్క్ స్ట్రాటజీ వర్కౌట్ అవుతోంది. ఫిరాయింపుల కొంపకే ఎసరు పెడితే ఏమీ చేయలేరన్న ధీమాతోనే ఆపరేషన్ స్టార్ట్ అయిందట.


మరింత సమాచారం తెలుసుకోండి: