రోజు రోజుకు పాడేరు ఫిరాయింపు ఎంఎల్ఏ గిడ్డి ఈశ్వరిలో టెన్షన్ పెరిగిపోతోంది. ప్రాణాలకు ముప్పు ఏ వైపు నుండి వస్తుందో అర్దంకాక పోవటంతో టెన్షన్ పెరిగిపోతోంది. ఒకవైపు  మావోయిస్టుల నుండి థ్రెట్. మరోవైపు సొంత మనుషులనే అనుమానించాల్సిన పరిస్ధితులు. ఇంకోవైపు నియోజకవర్గంలో స్వేచ్చగా తిరిగేందుకు లేకుండా పోలీసుల ఆంక్షలు. ఇన్ని సమస్యల మధ్య గిడ్డి నియోజకవర్గంలో తిరగలేక, తిరక్కుండా ఇంట్లోనే కూర్చోలేక నానా అవస్తలు పడుతున్నారు.


తాజాగా కట్టుదిట్టమైన భత్రత మధ్య గిడ్డి చింతపల్లి మండలంలో పర్యటించారు. ఈమధ్యే అరకు ఫిరాయింపు ఎంఎల్ఏ కిడారి సర్వేశ్వరరావుతో పాటు మాజీ ఎంఎల్ఏ సివేరి సోమలను మావోయిస్టులు కాల్చి చంపేసిన విషయం తెలిసిందే. అప్పటి నుండి గిడ్డిలో ఆందోళన పెరిగిపోయింది. తాను కూడా మావోయిస్టుల హిట్ లిస్టులో ఉన్నట్లు తెలిసినదగ్గర నుండి టెన్షన్ మరింత పెరిగిపోతోంది. కోట్ల రూపాయలు తీసుకుని పార్టీ ఫిరాయించినందుకు, అక్రమంగా మైనింగ్ చేస్తున్నందుకు, స్ధానిక గిరిజనుల ప్రయోజనాలకు విరుద్దంగా వ్యవహరిస్తున్నందుకే మావోయిస్టులు కిడారిని హత్య చేసినట్లు ప్రచారం జరుగుతోంది.


 కిడారి చేసిన పనులే దాదాపు గిడ్డి కూడా చేస్తున్నారు. దాంతో ప్రాణభయంతో ఉన్న గిడ్డి అనవసరంగా టిడిపిలోకి ఫిరాయించి ప్రాణాలమీదకు తెచ్చుకున్నానే టెన్షన్ మొదలైందట. చింతపల్లి మండలంలో పర్యటించిన గిడ్డికి పోలీసులు అసాధారణ ఏర్పాట్లు చేశారు. జి మాగుగుల నుండి చింతపల్లి చేరుకునే మార్గంలో ప్రత్యేక బలగాలను మోహరించారు. బాండ్ స్క్వాడ్ బృందాలు రోడ్డు, కల్వర్టులతో పాటు వేదికను కూడా క్షుణ్ణంగా పరిశీలించాయి. గిడ్డి పాల్గొన్న సభకు చుట్టుపక్కల రెండు కిలోమీటర్ల వరకూ పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. సభా వేదిక పక్కనే ఉన్న పెద్ద వాటర్ ట్యాంకుపైకెక్కి కూడా పోలీసులు కాపలా కాయటం గమనార్హం.

 


మరింత సమాచారం తెలుసుకోండి: