తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఈ సారి జరగబోయే ఎన్నికలలో కెసిఆర్ ని ఎలాగైనా గద్దె దింపాలని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రధాన రాజకీయ పార్టీలు మహాకూటమిగా ఏర్పడిన సంగతి మనకందరికీ తెలిసినదే. కాంగ్రెస్, టీడీపీ,  సిపిఐ, తెలంగాణ జన సమితి పార్టీలు కలిసి మహా కూటమిగా ఏర్పడి రాబోయే ఎన్నికలలో అధికార పార్టీ టీఆర్ఎస్ ని చిత్తుచిత్తుగా ఓడించాలని ..పొత్తులతో సరికొత్త ఎత్తులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో మహా కూటమికి చెందిన నేతలు..టిఆర్ఎస్ పార్టీ పై ఓ రేంజులో విరుచుకుపడుతున్నారు.

Related image

ఇదే క్రమంలో టిఆర్ఎస్ పార్టీ కూడా మహా కూటమికి చెందిన నేతల పై రాజకీయ పార్టీలపై తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తాజాగా చేసిన కామెంట్ తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది.

Related image

కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిన టిడిపి పార్టీ..ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీతో జతకట్టడం పై నుండి ఎన్టీఆర్ ఆత్మ చూస్తే బాధపడుతుందని..ఇదే క్రమంలో నందమూరి హరికృష్ణ బతికి ఉంటే ఈ కూటమి ఏర్పాటు అయ్యేది కాదని పేర్కొన్నారు.

Image result for talasani srinivas yadav

ఇదే క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వియ్యంకుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ...తెలంగాణ రాష్ట్రంలో సత్తుపల్లి నియోజకవర్గం లో టిడిపి పార్టీ గెలుపు కోసం తీవ్రంగా కష్టపడుతున్నారని...పేర్కొంటూ ఈ సమయంలో హరికృష్ణ ఉంటే ఈ సన్నివేశాన్ని చూసి సిగ్గు పడే వారని తలసాని శ్రీనివాస్ యాదవ్ అభిప్రాయపడ్డారు. తాజాగా కాంగ్రెస్ టిడిపి పార్టీ పొత్తు తెలుగుదేశం పార్టీలో ఉన్న నేతలే హర్షించటం లేదని సంచలన కామెంట్ చేశారు తలసాని.


మరింత సమాచారం తెలుసుకోండి: