అన్న నందమూరి పార్టీ పెట్టిన తరువాత పిలుపు అందుకుని వ్యాపార రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వారు. ఎంవీవీఎస్ మూర్తి. ఆయన గోల్డ్‌స్పాట్‌ మూర్తిగా అంతవరకు జనాలకు తెలుసు. ఆయన పూర్తి పేరు మతుకుమిల్లి వీరవెంకట సత్యనారాయణమూర్తి. ఆయన స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా ఐనవిల్లి మండలం మూలపాలెం గ్రామం. కాకినాడలో ఉన్నత విద్యను మూర్తి అభ్యసించారు. వ్యాపార రంగంలో బాగా రాణిస్తూ విశాఖలో స్తిరపడిన మూర్తి అన్న గారి పిలుపు మేరకు టీడీపీలో చేరారు 


రెండు పర్యాయాలు ఎంపీగా :


మూర్తి రెండు సార్లు విశాఖ ఎంపీగా గెలిచారు. అంతకు ముందు ఆయన టీడీపీలో నామినేటెద్ పదవిగా విశాఖ నగరాభివ్రుధ్ధి సంస్థ  (వుడా) చైర్మన్ గా చాల కాలం పని చేసి నగరాభివ్రుధ్ధికి దోహదపడ్డారు. తొలిసారి 1989లో మూర్తి విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేసి పరాజయం పాలు అయ్యారు. ఆ తరువాత 1991లో అదే సీటు నుంచి రెండవ మారు పోటీ చేసి విజేత అయ్యారు. అలా  1991 నుంచి 1996, 1999 నుంచి 2004 వరకు మూర్తి విశాఖకు విశేష సేవలు అందించారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మూర్తిని ఎమ్మెల్సీ గా చంద్రబాబు పదవిని ఇచ్చి గౌరవించారు.


గీతంతో కీర్తి :


మూర్తి ఎంపీగా, ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నా ఆయన వ్యాపార రంగంలో రాణించినా కూడా అన్నిటి కంటే కూడా మిన్నగా విద్యాధినేతగానే పేరు సంపాదించుకోవడం విశేషం. మూర్తి గీతం విద్య సంస్థలను 1980లో విశాఖలో ప్రారంభించారు. ఇపుడది విశ్వవిద్యాలయం స్థాయికి చేరుకుంది. అన్ని చోట్లా కూడా విస్తరించింది. గీతం మూర్తి గారు అంటే అలా తెలియని వారు లేరు.


తీరని కోరిక :


సుదీర్ఘ కాలం పాటు రాజకీయల్లో ఉన్న మూర్తి మంత్రి కావాలనుకున్నారు. ఆయన ఎమ్మెల్సీగా నెగ్గిన తరువాత ఆ కోరిక నెరవేరుతుందేమోనని ఎదురుచూశారు. సామాజిక, రాజకీయ సమీకరణల వల్ల అది కుదరలేదు. దాంతో మూర్తి గారికి అది తీరని కోరికగానే మిగిలిపోయింది. అయితే మంత్రులు ఎంత మంది కూడా చంద్రబాబు నాయుడు ఆంతరంగికునిగా  ఆయన చాల కీలకమైన స్థానంలోనే ఉన్నారు.


ఉత్తరాంధ్రకు పెద్ద దిక్కు :


మూర్తి మరణంతో ఉత్తరాంధ్ర టీడీపీ పెద్ద దిక్కుని కోల్పోయింది. ఆయన మూడు జిల్లాల్లో పార్టీని కను సన్నల్లో నడిపించారు. ఎపటికపుడు పార్టీ పరిస్తితులన్నీ అధినేత చంద్రబాబుకు తెలియచేస్తూ ఉండేవారు. ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం ఆయన తనదైన వ్యూహాలను అమలు చేసేవారు. ఆ విధంగా చూసుకుంటే టీడీపీకి మూర్తి మరణం భారీ లోటుగానే చెప్పాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: