భారత దేశంలో గత కొంత కాలంగా అంతరించి పోతున్న జీవాలను సంరక్షించడానికి భారత ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటుంది.  ముఖ్యంగా పులులు, సింహాలు, జింకలు ఇలా కొన్ని కృర, సాధు జంతువులను సంరంక్షించడంలో ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది ప్రభుత్వ రంగ సంస్థలు.  తాజాగా గుజరాత్ లోని గిర్ అభయారణ్యంలో గుర్తు తెలియని వైరస్, ఇన్ ఫెక్షన్ల కారణంగా మృతి చెందుతున్న సింహాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటం అధికారుల్లో ఆందోళన కలిగిస్తోంది. 

ఇప్పటికే అక్కడ  21 సింహాలు మరణించినట్టు గుర్తించిన అధికారులు, వీటిల్లో నాలుగు సింహాలు వైరస్ తో, ఆరు సింహాలు ప్రొటోజోవా ఇన్ ఫెక్షన్ తో మరణించాయని భావిస్తున్నట్టు తెలిపారు.  ఈ వ్యాధి పురుగుల ద్వారా వ్యాపించి ఇన్ ఫెక్షన్ కి కారణం అవుతున్నట్లు అధికారులు గుర్తించారు.  దల్ఖానియా రేంజ్ ప్రాంతంలో ఇన్ ఫెక్షన్ ప్రభావం అధికంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు.   వాటిని రెస్క్యూ కేంద్రానికి తరలించి చికిత్సను అందిస్తున్నామని తెలిపారు. 

ఈ వైరస్ కి యాంటీ వైరస్ ఏర్పాటుకు అన్నిరకాలుగా ప్రయత్నిస్తున్నారని..అందుకోసం సింహాల కళేబరాల్లో తమకు కనిపించిన వైరస్ ఏంటన్న విషయాన్ని పరిశీలిస్తున్నామని వైద్యులు తెలిపారు.  మిగతా సింహాలకు వైరస్ సోకకుండా యూఎస్ నుంచి వాక్సిన్ ను తెప్పిస్తున్నామని గుజరాత్ ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. కాగా, 2015 లెక్కల ప్రకారం గిర్ అడవుల్లో 520 సింహాలు ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: