రసాయనశాస్త్రంలో ఈ ఏడాది ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ వరించింది. ఫ్రాన్సెస్ హెచ్. అర్నాల్డ్, జార్జ్ పీ స్మిత్, సర్ గ్రెగరీ పీ వింటర్‌లు ఈ ఏడాది సంయుక్తంగా కెమిస్ట్రీ నోబెల్ గెలుచుకున్నారు. రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఈ పేర్లను ప్రకటించింది. అవార్డులో సగం అమౌంట్ ఫ్రాన్సెస్ అర్నాల్డ్‌కు దక్కనున్నది. ఎంజైమ్‌లపై చేసిన పరిశోధనలకు గాను ఈ అవార్డులు దక్కాయి. జీవపరిణామ సిద్ధాంతం మాదిరిగా ఎంజైమ్‌లను శాస్త్రవేత్తలు విశ్లేషించారు. 2018 రసాయనిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని అమెరికా, బ్రిటన్ శాస్త్రవేత్తలు దక్కించుకున్నారు. 


తాజాగా అమెరికాకు చెందిన ఫ్రాన్సెస్ హెచ్ ఆర్నాల్డ్, జార్జ్ పి.స్మిత్, బ్రిటన్ కు చెందిన పి.వింటర్ లు సంయుక్తంగా ఈ ఏడాది కెమిస్ట్రీ విభాగంలో నోబెల్ బహుమతిని అందుకున్నారు.  జీవరసాయన పరిశ్రమల అభివృద్ధి కోసం ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు కొత్త సిద్ధాంతాన్ని డెవలప్ చేశారు. కొత్త వస్తువుల సృష్టి, సుస్థిర జీవ ఇంధన ఉత్పత్తి, వ్యాధుల నిర్మూలన, ప్రాణులను రక్షించేందుకు కావాల్సిన ఫార్ములాలను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.  ఈ అవార్డు కింద లభించే రూ.7.32 కోట్లలో ఆర్నాల్డ్ కు సగం, మిగతా ఇద్దరికి మిగిలిన మొత్తం దక్కనుంది.


ఈ బహుమతిని రాయల్ స్వీడిష్ అకాడమీ సభ్యులు ప్రకటించారు. ఫ్రాన్సెస్ హెచ్ ఆర్నాల్డ్ 1993లో ఎంజైమ్ ల మీద పరిశోధనలు నిర్వహించారు. ఇందులో భాగంగా పలు ఉత్ప్రేరకాలను ఆమె అభివృద్ధి చేశారు. దీనివల్ల రసాయనిక చర్యలు వేగవంతమవుతాయి. తద్వారా ఇంధనాన్ని, మందులను తొందరగా తయారు చేయవచ్చు.  శాస్త్రవేత్త జార్జ్ స్మిత్ బ్యాక్టీరియోఫేజ్ పద్దతిని డెవలప్ చేశారు. బ్యాక్టీరియాను ఆక్రమించే వైరస్‌ను ఆయన కనుగొన్నారు. ఈ పద్ధతితో కొత్త ప్రోటీన్ల క్రమాన్ని విశ్లేషించవచ్చు. జన్యు మార్పులు, జన్యు ఎంపిక ఆధారంగా ప్రోటీన్లను అభివృద్ధి చేశారన్నారు. సర్ గ్రెగరీ వింటర్ తన పరిశోధనలతో కొత్త తరహా ఫార్మస్యుటికల్స్ సృష్టించినట్లు నోబెల్ కమిటీ పేర్కొన్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: