తెలంగాణా ఆపద్దర్మ ముఖ్యమంత్రి కెసియార్ ఏపి సిఎం చంద్రబాబును అడ్డదిడ్డంగా తిట్టేశారు. నోటికెంతొస్తే అంతా తిట్టారు. చంద్రబాబును తిట్టి తిట్టి తన కసినంతా తీర్చేసుకున్నారు. నిజామాబాద్ లో ఈరోజు జరిగిన ఆశ్వీరాద సభలో కెసియార్ మాట్లాడుతూ, చంద్రబాబును ఓ  రేంజిలో ఆడేసుకున్నారు.  ఓటుకునోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగ అంటూ దుమ్ము లేపేశారు. తెలంగానా పాలిట చంద్రబాబు ఓ రాక్షసుడు అంటూ ధ్వజమెత్తారు.

 

తెలంగాణా ఎన్నికల్లో టిడిపితో పొత్తుపెట్టుకున్నందుకు కాంగ్రెస్ నేతలను కూడా నోటికొచ్చినట్లు తిట్టిపోశారు. తెలంగాణా వ్యతిరేకితో కాంగ్రెస్ నేతలు పొత్తు పెట్టుకుంటారా అంటూ శాపనార్దాలు పెట్టారు. 14 ఏళ్ళు కొట్లాడి, నిరాహార దీక్ష చేసి చావుబతుకుల పోరాటం ద్వారా తాను తెలంగాణాను తీసుకొస్తే కాంగ్రెసోళ్ళు అమరావతికి తెలంగాణాను తాకట్టు పెడతారా అంటూ మండిపడ్డారు. తెలంగాణా రాకుండా శాయశక్తులా ప్రయత్నించిన ద్రోహి చంద్రబాబు అంటూ ధ్వజమెత్తారు.

 

టిడిపితో పొత్తు పెట్టుకున్నందుకు కాంగ్రెస్ పార్టీకి రూ. 500 కోట్లు, ప్రచారం కోసం మూడు హెలికాప్టర్లు ఇస్తానని చంద్రబాబు రెడీ చేశారంటూ కెసియార్ ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చిన కొత్తల్లోనే ప్రభుత్వాన్ని అస్ధిరపరచటానికి ప్రయత్నించిన దొంగతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటుందా ? దాన్ని ప్రజలు హర్షిస్తారా ? అంటూ కెసియార్ బహిరంగ సభలో పాల్గొన్న ప్రజలను ప్రశ్నించారు. ఇంత స్ధాయిలో చంద్రబాబుపై ఎప్పుడూ కెసియార్ విరుచుకుపడలేదు. చూడబోతే కాంగ్రెస్, తెలుగుదేశంపార్టీల పొత్తుల వ్యవహారం కెసియార్ పై గట్టి ప్రభావాన్నే చూపినట్లు అర్దమైపోతోంది. మరి, ముందు ముందు ఇంకా ఎన్ని మాటలంటారో చూడాల్సిందే . అంతా బాగానే  ఉంది కానీ మరి కెసియార్ ఆరోపణలకు, విమర్శలకు చంద్రబాబు అంతే రేంజిలో సమాధానం ఇవ్వగలరా ?

 


మరింత సమాచారం తెలుసుకోండి: