Image result for KCR speech in aseervada sabha on chandrababu congress

తెలంగాణను సర్వనాశనం చేసిన ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకోవడం తెలంగాణ ఆత్మగౌరవాన్ని అమరావతికి తాకట్టు పెట్టడమేనని తెలంగాణా రాష్ట్ర సమితి అధినేత కలవకుంట్ల చంద్రశేఖర రావు అగ్ని కణికలు చెలరేగేలా విమర్శించారు. నిజామాబాద్‌ లో బుధవారం నాడు జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో  కేసిఆర్ ప్రసంగించారు. చంద్రబాబు నాయుడుతో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకోవడాన్ని కేసీఆర్ తీవ్రంగా విమర్శించారు.


Image result for KCR speech in aseervada sabha on chandrababu congress

తెలంగాణను సర్వనాశనం చేసిన చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకొంటారా? అని ఆయన కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించారు.

తెలంగాణను నాశనం చేసిన టీడీపీ తో కాంగ్రెస్‌ తో పొత్తు పెట్టుకోవడమా? థూ.... అంటూ కాంగ్రెస్‌ పై దుమ్మెత్తి పోశారు.

దుర్మార్గుడైన చంద్రబాబుతో పొత్తా?

ఇంతకంటే దుర్మార్గము ఉంటుందా? అని ప్రశ్నించారు.

కాంగ్రెస్ పార్టీ నేతలు చంద్రబాబు నాయుడుకు తెలంగాణను ఎలా దాసోహం చేస్తారు? అని ప్రశ్నించారు.

Image result for KCR speech in aseervada sabha on chandrababu congress

ఏడు మండలాలను చంద్రబాబు నాయుడు గుంజుకొన్నాడని కేసీఆర్ చెప్పారు.

సీలేరు పవర్ ప్రాజెక్టును గుంజుకొన్నాడని ఆయన చెప్పారు. 

తెలంగాణ ద్రోహి చంద్రబాబు తో పొత్తుపెట్టుకొంటారా?

అడుక్కొంటే తెలంగాణ లో మేం నాలుగు సీట్లు ఇవ్వమా? అని కేసీఆర్ ప్రశ్నించారు.

తెలంగాణ ఆత్మగౌరవాన్ని అమరావతి లో తాకట్టు పెట్టుకొంటారా? అని ఆయన ప్రశ్నించారు. 


Image result for KCR speech in aseervada sabha on chandrababu congress

ఓటుకు నోటు కేసులో సఖల జనులకు దొరికిన దొంగ చంద్రబాబు నాయుడు అన్నారు కేసీఆర్. అమరావతి గులామ్ లు, ఢీల్లీ గులామ్ లు ఎవరు కావాలో? తేల్చుకోవా లని కేసీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ గులాంగిరీ మనస్థత్వానికి చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడమే ఒక పరాకాష్ట అన్నారు. 

Image result for KCR speech in aseervada sabha on chandrababu congress
కాంగ్రెస్ పార్టీకి చంద్రబాబు నాయుడు రూ.500 కోట్లు డబ్బు, మూడు హెలికాప్టర్లు ఇచ్చి ప్రచారం చేయిస్తున్నాడని కేసీఆర్ ఆరోపించారు. ఇంత కాలంపాటు పోరాటం చేసి తెచ్చుకొన్న తెలంగాణను తిరిగి అమరావతికి తాకట్టు పెడుతారా? అని ప్రశ్నించారు. తెలంగాణ మేథావులు ఈ విషయాన్ని ఆలోచించాలని కేసీఆర్ కోరారు.


Image result for KCR speech in aseervada sabha on chandrababu congress

"సిగ్గు లేకుండా చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకుంటున్నారు. తెలంగాణను నాశనం చేసిన వ్యక్తితో కాంగ్రెస్‌ పొత్తు పెట్టుకుంది. తెలంగాణ ద్రోహి చంద్రబాబుతో పొత్తా? సిగ్గుండాలి. ఇదా! మీ బతుకు. అడుక్కుంటే మేం నాలుగు సీట్లు ఇస్తాం. మళ్లీ అధికారం ఆంధ్రోళ్లకు అప్పగిస్తారా? తెలంగాణ కోసం ఇంత మంది చచ్చిపోయింది ఇందుకేనా? చావు దగ్గరకుపోయి తెలంగాణ తెచ్చింది ఇందుకేనా? అమరావతి కి తెలంగాణను తాకట్టు పెడతారా? దుర్మార్గుడైన చంద్రబాబుతో పొత్తా? తెలంగాణకు కరెంటు ఇవ్వని రాక్షసుడు చంద్రబాబు. చంద్రబాబు కేంద్రానికి లేఖలు రాసి తెలంగాణ ప్రాజెక్టులు అడ్డుకున్నారు. చంద్రబాబు తెలంగాణ లో రాజకీయ అస్థిరత తేవాలని చూశారు" అని కేసీఆర్ మండిపడ్డారు.


Image result for vote for note case


నిజామాబాద్ జిల్లా ఇందూరులో జరిగిన టీఆర్ఎస్ ఆశీర్వాదసభకు అనబడే ఈ భారీ బహిరంగ సభకు భారీ ఎత్తున టీఆర్ఎస్ నేతలు ప్రజావాహిని హాజరైంది. గిరిరాజ్ కాలేజ్ మైదానంలో జరిగిన ఈ బహిరంగ సభకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఎంపీ కవిత సహా పలువురు పార్టీ కీలక నేతలు, ఆయా నియోజకవర్గాలకు చెందిన పార్టీ అభ్యర్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకుంటున్నాయి.
 Image result for KCR speech in aseervada sabha on chandrababu congress

మరింత సమాచారం తెలుసుకోండి: