జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రజాపోరాట యాత్ర ఎఫెక్ట్ రెండు గోదావరి జిల్లాలో స్పష్టం గా కనబడుతోంది. 2014 ఎన్నికలలో పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టకముందు వరకు ఉభయగోదావరి జిల్లాల్లో ఓటర్ దృష్టి మొత్తం అప్పటిదాక జగన్ మీద ఉండగా..ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించాడో..ఒక్కసారిగా ఓటర్ దృష్టి మొత్తం పవన్ వైపు మళ్లింది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ఎన్నికలలో పోటీ చేయకుండా తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలపడంతో..రెండు గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఆల్మోస్ట్ అన్ని మెజార్టీ స్థానాలు దక్కించుకొని విభజనతో నష్టపోయిన ఆంధ్రరాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది.

Image may contain: 1 person, eating and indoor

అయితే గత నాలుగు సంవత్సరాల చంద్రబాబు పరిపాలన అవినీతిమయం పాలవడంతో పవన్ కళ్యాణ్ టీడీపీ ని వ్యతిరేకించి..రానున్న ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మొదలుపెట్టిన ప్రజా పోరాట యాత్ర రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోంది. ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లాలో జరుగుతున్న ప్రజా పోరాట యాత్ర కి ప్రజలు..పవన్ కళ్యాణ్ కి నీరాజనాలు పడుతున్నారు.

Image result for harsha kumar

ఈ నేపథ్యంలో రెండు గోదావరి జిల్లాలో ఉన్న చాలా మంది రాజకీయ నాయకులు జనసేన పార్టీలో చేరారు. అయితే తాజాగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాజమండ్రి మాజీ పార్లమెంటు సభ్యుడు అయిన హర్ష కుమార్ జనసేన పార్టీ లోకి రావడానికి ఇష్టపడుతున్నట్లు గోదావరి రాజకీయాల్లో టాక్. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలోనే నా రాజకీయ ప్రయాణం ప్రారంభమైందని ఆయన చెప్పారు.

Image result for harsha kumar pawan kalyan

ఇంటర్, డిగ్రీలో కాంగ్రెస్ తో తన అనుబంధం ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీకి క్రమశిక్షణ గల సైనికుడిగా పనిచేసినట్టు ఆయన గుర్తు చేసుకొన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ టీడీపీపై నిరంతరం పోరాటం చేసినట్టు చెప్పారు. తెలంగాణలో టీడీపీతో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకోవడం నాకు బాధ కల్గించిందన్నారు.  దీంతోనే కాంగ్రెస్ పార్టీలో చేరాలనే ఆలోచనను విరమించుకొన్నట్టు ఆయన చెప్పారు. త్వరలోనే తన అనుచరులతో చర్చించి ఏ పార్టీలో జాయిన్ అవుతానో ఆ విషయాన్ని మీడియా కి కచ్చితంగా చెబుతానని ఈ సందర్భంగా తెలియజేశారు హర్ష కుమార్.




మరింత సమాచారం తెలుసుకోండి: