చంద్ర బాబు మీద కేసీఆర్ బాణాలు వదులుతున్నాడు ఆ బాణాలు బలంగా బాబు కు తాకుతున్నాయి. ఓటుకు నోటు కేసులో బాబు ను ముప్పు తిప్పలు పెట్టిన కేసీఆర్ ఇప్పుడు ఎన్నికల సమయం లో ఆడుకుంటున్నాడు. ఇంకా కేసీఆర్ ఏమన్నాడంటే  నీళ్ల కోసం తెలంగాణలో ప్రాజెక్టులు కడుతుంటే, వాటిని అడ్డుకోవడం కోసం కేంద్రానికి 36 లేఖలు రాసిన తెలంగాణ ద్రోహిగా చంద్రబాబును కేసీఆర్ అభివర్ణించారు. కృష్ణా, గోదావరి ప్రాజెక్టులకు అడ్డం పడుతున్న ఇలాంటి దుర్మార్గుడితో పొత్తుపెట్టుకొని కాంగ్రెస్ పార్టీ చారిత్రక తప్పిదం చేసిందన్నారు. 

Image result for chandra babu and kcr

7 మండలాలు గుంజుకున్న దుర్మార్గుడు చంద్రబాబు. తెలంగాణకు కరెంట్ లేకపోతే, కరెంట్ కోసం చట్టం కూడా పాస్ అయితే, దాన్ని ఉల్లంఘించి మనకు కరెంట్ ఇయ్యకుండా చేశాడు. మనం కరెంట్ కోసం కష్టాలు పడుతుంటే రాక్షస ఆనందం పొందాడు. అలాంటి చంద్రబాబుతో పొత్తా.. సిగ్గు శరం ఉండాలి." తాజాగా ఓటుకు నోటు కేసులో కూడా దొరికిపోయి హైదరాబాద్ రావడానికి నానా ఇబ్బందులు పడుతున్న చంద్రబాబు, తెలంగాణలో మరోసారి కుతంతం పారించడానికి కాంగ్రెస్ తో కలిసి పన్నాగాలు పన్నుతున్నారని, ఈ విషయంపై ప్రజలు విజ్ఞతతో వ్యవహరించాలని కోరారు కేసీఆర్.

Image result for chandra babu and kcr

ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగ చంద్రబాబు. కొత్తగా వచ్చిన తెలంగాణను దాచి దాచి దెయ్యాలకు అప్పగించినట్టు చంద్రబాబుకు అప్పగిద్దామా. దయచేసి ఆలోచించండి." నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన భారీ బహిరంగ సభలో కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. చావు నోట్లో పెట్టుకొని సాధించుకున్న తెలంగాణను అమరావతికి అప్పగించొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: