ఆయన అలాంటి ఇలాంటి నాయకుడు కాదు, పూర్తి పల్లెటూరి నేపధ్యం నుంచి వచ్చి ఏపీ రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను తెచ్చుకున్న నాయకుడు. ఒకసారి కాదు, ఏకంగా ఏడు సార్లు గెలిచిన జగజెట్టి. అటువంటి నాయకున్ని ఢీ కొట్టడం అంటే ఆషా మాషీ యవ్వారం కాదు. కానీ దేనికైన ప్రజలు ఉండాలి. ఆ గాలిని మల్లిస్తే చాలు, కాగల కార్యం హ్యాపీగా పూర్తవుతుంది. ఇపుడు అదే జరుగుతోంది.


నెల్లిమర్ల ఎవరిది :


నెల్లిమర్ల సీటు 2009 ఎన్నికల్లో ఏర్పడింది. విజయనగరం జిల్లాలో ఇది కీలకమైన సీటు. అంతకు ముందు ఇది భోగాపురం నియోజకవర్గంలో ఉండేది. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామి నాయుడు ఉన్నారు. ఆయన ఏకంగా ఏడుసార్లు ఎమ్మెల్యే అంటేనే అర్ధం చేసుకోవచ్చు. చాలా స్ట్రాంగెస్ట్ పెర్సన్ అని. నాయుడు గారిని అన్న గారి టైం నుంచి జనం గెలిపిస్తూ వస్తున్నారు. 


ఒకే సారి  అలా :


ఇక ఆయన ఓడింది ఒకేసారి. అదీ కూడా 2009లో ఓడించింది బొత్స  సత్యనారాయణ సోదరుడు అప్పలనాయుడు. అంటే బొత్స రాజకీయం ముందు పతివాడ వ్యూహం బెడిసికొట్టిందన్న మాట. 2014లో వైసీపీ తరఫున సూర్యనారాయణరాజు పోటీ చేస్తే పతివాడ ఆయన్ని ఆరు వేల ఓట్ల తేడాతో ఓడించి తడాఖా చూపించారు. ఇపుడు అదే చోట జగన్ నినాదం మోగుతోంది.


ఈసారి అయ్యెనా :


నెల్లిమర్లను ఈ సారి కొట్టేయాలని జగన్ భారీ స్కెచ్ గీసారు. అక్కడ జగన్ పెట్టిన మీటింగుకు జనం పొటెత్తారు. ఎన్నడూ లేని విధంగా జనమే జనం కనిపించారు. అంటే పతివాడ అంటే మొహం మొత్తిందా అన్న ఆలొచన రేకెత్తేలా జనం విరగబడి వచ్చారు. ఈసారి ఎలాగైన పాగా వేయాలని జగన్ డిసైడ్ అయ్యారు. ఇక్కడ  నుంచి ఏకంగా రాజకీయ కురు వ్రుధ్ధుడు సాంబశివరాజుని జగన్ దించుతున్నారు.
 పతివాడ ఈసారి బరిలో ఉండరని అంటున్నారు. ఆయన కాకపోతే ఆయన కొడుకు రంగంలో ఉంటారు. మరి పతివాడ ఫ్యామిలీని దెబ్బ తీసి సీటు వైసీపీ పట్టేస్తుందా. ఎన్నీకల వరకూ ఏమో కానీ ఇపుడు మాత్రం చూస్తే జగన్ కి జన నీరాజనంతో నెల్లిమర్ల మళ్ళిపోతోంది టీడీపీ గూటి నుంచి అనిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: