రాష్ట్రంలో ఎన్నిక‌ల వేడి రాజుకుంటున్న కొద్దీ.. నాయ‌కులు త‌ల రాత‌లు కూడా మారుతున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు అసెంబ్లీ బ‌రిలో త‌మ‌కు తిరుగులే దని బావించిన నాయ‌కులకు పార్టీల అధినాయ‌కులు పెద్ద ఎత్తున జాత‌కాలు మార్చేస్తుండ‌డం గ‌మ‌నార్హం. ఎన్ని తిప్ప‌లు ప‌డినా వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ అసెంబ్లీకి ఎన్నిక‌వ్వాల‌ని భావిస్తున్న ఇద్ద‌రు మంత్రులకు టీడీపీ అధినేత చుక్క‌లు చూపిస్తున్నార‌ని అంటున్నారు. వారికి అసెంబ్లీతో సంబం దం లేకుండా పార్ల‌మెంటుకు పంపాల‌ని చంద్ర‌బాబు నిర్ణ‌యించుకున్న‌ట్టు తాజాగా అమ‌రావ‌తి వ‌ర్గాలు చెబుతున్నాయి. విష‌యంలోకి వెళ్తే.. రాజ‌ధాని జిల్లా గుంటూరు నుంచి ఎన్నికైన ప్ర‌త్తిపాటి పుల్లారావు, న‌క్కా ఆనంద‌బాబులు ఇప్పుడు చంద్ర‌బాబు కేబినెట్‌లో కీల‌క మంత్రులుగా ఉన్నారు. వీరిద్ద‌రికీ కూడా చంద్ర‌బాబు ప్ర‌ముఖ ప్రాధాన్యం ఇస్తున్నారు. 


అయితే, వీరిద్ద‌రూ కూడా త‌మ త‌మ నియోజ‌క‌వ‌ర్గాల‌కు దూరంగా కార్య‌క‌లాపాలు నిర్వ‌హిస్తుండ‌డం వీరిని తీవ్ర వివాదానికి దారితీసేలా చేశాయి. మంత్రిగా అటు ప్ర‌త్తిపాటి కానీ, ఇటు న‌క్కా ఆనంద‌బాబుకానీ.. చంద్ర‌బాబు మార్కు సంతృప్త‌స్థాయిని చేరుకోలేక పోయారు. దీంతో వీరి వీరి నియోజ క‌వ‌ర్గాల్లో వీరిపై తీవ్ర‌మైన వ్య‌తిరేక‌త ఉన్న‌ట్టు తాజాగా చంద్ర‌బాబు నిర్వ‌హించిన ఇంటిలిజెన్స్ స‌ర్వేలో స్ప‌ష్టంగా తెలిసింది. ప్ర‌త్తిపాటికి ఫ‌ర్వాలేద‌నే మార్కులు వ‌చ్చినా.. న‌క్కా ఆనంద‌బాబుకు మాత్రం ఆయ‌న సామాజిక వ‌ర్గాల నుంచే తీవ్ర‌మైన వ్య‌తిరేక‌త వ‌స్తున్న‌ట్టు స‌మాచారం. పైగా వీరిద్ద‌రూ కూడా శాఖ‌ల‌పై ప‌ట్టులేకుండా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్టు చంద్ర‌బాబుకు తెలిసిపోయింది. దీంతో వీరిద్ద‌రినీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో అసెంబ్లీకి కాకుండా పార్ల‌మెంటు కు పంపాల‌ని చంద్ర‌బాబు భావిస్తున్న‌ట్టు తాజాగా వార్త‌లు వెలుగు చూస్తున్నాయి. 


అంటే.. బాబు దృష్టిలో వారికి దాదాపు అసెంబ్లీ సీట్లు లేవ‌నే విష‌యం స్ప‌ష్టంగా తెలుస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వీరికి పార్ల‌మెంటు టికెట్లు అంటే.. ఆ రేంజ్‌లో వీరికి స‌త్తా ఉంటే టికెట్లు ఇవ్వ‌డం లేకుంటే టికెట్లు అడ‌గొద్ద‌ని చెప్ప‌డం అనేది చంద్ర‌బాబు మ‌న‌సులోమాట‌గా చెబుతున్నారు. అంటే,, దాదాపుగా వీరిద్ద‌రూ ఇక ఇంటికే ప‌రిమిత‌మ‌వుతారా? అనేది కూడా సందేహంగా ఉంది. ప్ర‌త్తిపాటికి ఎంపీగా పోటీ చేసే ఆర్థిక స్థోమ‌త ఉన్న‌ప్ప‌టికీ.. న‌క్కా ఆనంద‌బాబుకు మాత్రం ఆరేంజ్‌లేద‌ని, ఆయ‌న‌కు ఆర్థిక స్థోమ‌త ఉన్నా.. కేడ‌ర్ మాత్రం చాలా ఇబ్బందేన‌ని అంటున్నారు. దీంతో చంద్ర‌బాబు వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారని, ఈ ఇద్ద‌రికీ పొమ్మ‌న‌లేక పొగ‌బెడుతున్నార‌ని అంటున్నారు. ఏదేమైనా ఇద్ద‌రు మంత్రుల‌కు ఇలా జ‌ర‌గ‌డం అందునా రాజ‌ధాని జ‌ల్లాలో ఇలాంటి వాతావ‌ర‌ణం ఎదురు కావ‌డం అంద‌రినీ విస్మ‌యానికి గురి చేస్తున్న విష‌యంగా చెప్పుకొంటున్నారు. మ‌రి బాబు ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్తారో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: