ఇపుడిదే చర్చ ఉభయగోదావరి  జిల్లాలో తీవ్ర చర్చనీయాంశమైంది. పశ్చిమగోదావరి జిల్లాలో రెండో విడత ప్రజా పోరాట యాత్ర  చేస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన సహజ శైలికి భిన్నంగా పబ్లిక్ స్పీచ్ ల్లో దూకుడు పెంచారు. మొదటి విడత పర్యటనలో సాదాసీదాగా సాగిన పవన్ ప్రసంగాలు రెండో విడత మొదలై దెందులూరుకు వచ్చేసరికి ఒక్కసారిగా టాప్ లేపేసిది. అందుకు కారణాలపైనే ప్రస్తుతం జనాల్లోను, పవన్ అభిమానుల్లోను జోరుగా చర్చ మొదలైంది.

 

నిజానికి దెందులూరు టిడిపి ఎంఎల్ఏ చింతమనేని ప్రభాకర్ అరాచక వాది క్రిందే లెక్క. ఆయనపై లేని కేసుల్లేవు. లేని ఆరోపణల్లేవు. ఇసుక అక్రమ దందాలు, జనాలనపై దాడులు చేయటం, తనకు నచ్చని అధికారులను నోటికి వచ్చినట్లు తిట్టటం, ఎవరపైనైనా కోపం వస్తే వెంటనే వారిపై పడి కొట్టేయటం చింతమనేనికి చాలా సహజం. అందుకే నియోజకవర్గంలో ఎప్పుడూ వివాదాల్లోనే ముణిగి తేలుతుంటారు. బహుశా చంద్రబాబునాయుడుకు కూడా ఈ లక్షణమే నచ్చుంటుంది. అందుకే చింతమనేని చేష్టలను చూసి చూడనట్లు వదిలేస్తున్నారు.

 

దాన్ని అలుసుగా తీసుకుని చింతమనేని రెచ్చిపోతున్నారు. అందులోనూ గోదావవరి జల్లాల్లో కమ్మ, కాపు సామాజికవర్గాల గొడవుంది కదా ? అదే ఇపుడు ప్రముఖంగా తెరపైకి వచ్చింది. నియోజకవర్గంలోని కొందరు కాపు నేతలకు ఎంఎల్ఏతో పడదట. అదే విషయాన్ని వారు పవన్ తో చెప్పారని సమాచారం. దానికి తోడు మొన్నటి వరకూ నియోజకవర్గంలో చింతమనేనికి ఎదురులేదు. ఎవరినైనా తిడితే తిట్టుచుకోవాలి, కొడితు కొట్టిచ్చుకోవాలన్నట్లుండేది పరిస్ధితి.

 

కానీ వైసిపి తరపున నియోజకవర్గ సమన్వయకర్తగా అబ్బయ్య చౌదరిని జగన్ నియమించగానే చింతమనేని ఆగడాలను ప్రశ్నించటం మొదలైంది. ఎంఎల్ఏకి వ్యతిరేకంగా అబ్బయ్య భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలను మొదలుపెట్టారు. ఈమధ్య చింతమనేని ఇంటిముందే అబ్బయ్య ఏకంగా నిరాహార దీక్షకు దిగటం సంచలనంగా మారింది. అబ్బయ్య పిలుపుకు స్పందిస్తూ వేలాదిమంది జనాలు పోగవ్వటం ఆశ్చర్యమేసింది. అంటే ఎంఎల్ఏపై జనాల్లో ఏ స్ధాయిలో వ్యతిరేకత ఉందో అర్ధమైపోయింది.

 

ఇక్కడే దెందులూరు నియోజకవర్గం పవన్ దృష్టిని ఆకర్షించినట్లు చెబుతున్నారు. ఎలాగూ చింతమనేనిపై తీవ్రస్ధాయిలో వ్యతిరేకతుంది. ప్రతిపక్షంలో సరైన  నేత  లేకపోవటంతోనే ఇంతకాలం జనాలు చింతమనేని ఆగడాలను భరించారన్నది అర్ధమైంది. నియోజకవర్గంలో జనాభా రీత్యా బిసిలు, ఎస్సీలెక్కువ. టిడిపి, వైసిపి తరపున ఎటూ కమ్మ సామాజికవర్గం నేతలే నిలబడేటపుడు  జనసేన తరపున ఇతర సామాజికవర్గాల వారిని లేదా కాపులను నిలబెడితే గెలుపు ఖాయమని పవన్ అంచనా వేసుకున్నారు. అందుకనే ఇప్పటి నుండే చింతమనేనిపై ఆరోపణల జోరు పెంచారు. మరి వచ్చే ఎన్నికల్లో దెందులూరు నియోజకవర్గంలో కులాల సమరం ఎలా ఉండబోతోందో అర్ధం కావటం లేదు.

 

 

 

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: