దసరా అంటే పండుగ. కానీ లొతుగా తెలుసుకుంటే ఎన్నో అర్ధాలు, పరమార్ధాలు తెలుస్తాయి. మూడు రోజుల భోగి, సంక్రాంతి, కనుమలనే పెద్ద పండుగ అంటాం. మరి పది రోజుల దసరాను ఇంకెంత పెద్ద పండుగ అనాలో కదా. ప్రతి రోజూ వేడుకే. ప్రతి రాత్రి ముచ్చటే. నవ రాత్రులు, పది రోజులు ఇవీ దసరా ముచ్చట్లు.


దశ తిరిగేది :


దశ అంటే పది. మరో అర్ధంలో ఒక మలుపు అని అర్ధం వస్తాయి. తొమ్మిది రోజుల పాటు పగలూ రాత్రులు ఉత్సవాలు చేసుకుని పదవ రోజున అమ్మవారిని అందంగా అలంకరించి పూజించడమే దసరా పండుగ అంతరార్ధం. దశ అంటే పది అహరా అంటే రోజులు అని అర్ధం ఉంది. అలా చూసుకుంటే పది రోజుల పండుగ అని చెప్పుకోవాలి. పురాణాల్లో మరో అర్ధం కూడా చెబుతారు. దశ అంటే పది తలలు అంటే రావణాసురుడు అని అర్ధం.  హరా అంటే ఓడించడం, తొలగించడం అని అర్ధం వస్తుంది. అలా ఆలోచిస్తే రావణ వధను చేసిన సంఘటనను పురస్కరించుకుని దసరా జరుపుకోవడం అన్న మాట. 


రాముడి విజయమే:


దసరా అంటే రాముడి విజయమేనని పురాణాల్లో చెబుతుతారు. రావణాసురిడితో తొమ్మిది రోజుల పాటు యుధ్ధం చేసిన రాముడు పదవ రోజున అతన్ని వధిస్తాడు. దానికి సూచికగా పెద్ద ఎత్తున దసరా ఉత్సవాలను ఉత్తరాదిన జరుపుతారు. ఇక రాముడు సీత, లక్ష్మణ సమేతంగా అయోధ్యకు చేరుకుంటాడు. అప్పటికి 22 రోజులు పడుతుంది. ఆ రోజున దీపావళి జరుపుకుంటారు. అంటే దసరా, దీపావళి రెండు పండగలకు అలా ఓ బంధం ఉందన్నమాట. 


మరింత సమాచారం తెలుసుకోండి: