లోకేష్ ఇప్పుడు టీడీపీ పార్టీలో ఐటీ శాఖా మంత్రి అంత అనుకున్నట్టు జరిగితే తరువాత సీఎం కూడా అవుతాడు అయితే అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలు లోకేష్ గురించే అని అందరూ అనుకుంటున్నారు. వందేమాతరం కూడా సరిగా పాడటం రాని వాళ్లు మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా చలామణి అయిపోతూ ఉన్నారు. ఇక నుంచి నామినేషన్ వేసే సమయంలో వందేమాతర ఆలాపనను తప్పనిసరి చేయాలి. సరిగా పాడిన వాళ్ల నామినేషన్నే ఆమోదించాలి..’ అని అంటున్నాడు.. ఏపీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు.

Image result for lokesh

ఈయనకు ఉన్నట్టుంది ఎందుకిలా అనిపించిందో కానీ.. వందేమాతరం కాదు కదా, తడుముకోకుండా మాట్లాడటం కూడా రానివాళ్లు చింతకాయల అయ్యన్న పాత్రుడి సహచర మంత్రులుగా ఉన్నారు. వారిలో ముఖ్యుడు అయ్యన్న వాళ్ల పార్టీ అధినేత చంద్రబాబు నాయుడి తనయుడు లోకేష్ బాబు. లోకేష్ ప్రసంగాల గురించి ప్రపంచానికి తెలిసిందే. ఆయన మైకు ముందుకు వచ్చి ప్రసంగించాడంటే అంతే సంగతులు.

Image result for ayyanna patrudu

టీడీపీకి ఓటేస్తే ఉరేసుకున్నట్టే, కులపిచ్చి, మతపిచ్చి, బంధుప్రీతి ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశమే, విభజన నాటికి ప్రధానమంత్రి మోడీ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర విభజన కోసం పోరాడింది.. అంటూ చిత్రవిచిత్రంగా మాట్లాడిన ఘనుడు లోకేష్ బాబే. ఇక ప్రమాణస్వీకారం రోజున.. సార్వభౌమాధికారం.. అనే చిన్న పదాన్ని సరిగా పలకలేకపోయాడు.ప్రమాణస్వీకారోత్సవం రోజునే సరిగా పదాలను పలకలేకపోయిన లోకేష్ బాబు అయ్యన్న చెప్పిన నియమం అమల్లోకి వస్తే ఏమవుతాడో. నామినేషన్ రోజున వందేమాతర గీతాన్ని పాడించాలట. చూస్తుంటే.. లోకేష్ బాబును వచ్చే ఎన్నికల్లో నామినేషన్ కూడా వేయించకుండా ఉండేందుకు అయ్యన్న ఏదో కుట్ర చేస్తున్నట్టుగా ఉన్నాడే!

మరింత సమాచారం తెలుసుకోండి: