ఎంతో మోజుపడి, ఏమేమో ఆలోచించుకుని చంద్రబాబునాయుడు  చేసిన తాజా ప్రయోగం ‘ చంద్రన్నవిలేజ్ మాల్స్’ కూడా విఫలమైందా ?  క్షేత్రస్ధాయి నుండి అందుతున్న వివరాల ప్రకారమైతే అది విఫలప్రయోగం క్రిందే లెక్క. బడా కంపెనీలతో ఒప్పందాలు చేసుకుని చౌకధరల డిపోలను దశలవారీగా విలేజ్ మాల్స్ గా మారుద్దామని చంద్రబాబు బాగా మోజుపడ్డారు. అందుకని తనకు బాగా సన్నిహితమైన రిలయన్స్, ఫ్యూచర్ గ్రూప్ సంస్ధలతో సరకుల సరఫరాకు ప్రభుత్వం తరపున ఒప్పందాలు కూడా చేసుకున్నారు. ఎంతో ఆర్భాటంగా మొదలుపెట్టిన చంద్రన్న విలేజ్ మాల్స్ నిర్వహణలో చిత్తశుద్ది లేకపోవటంతో చివరకు మూలపడుతున్నాయి.


నిజానికి రేషన్ సరుకుల పంపిణీలో సమూల మార్పులు తేవాలన్నది చంద్రబాబు ఆలోచన. అంతవరకూ బాగానే ఉన్నా ఆచరణలోకి వచ్చేసరికి లక్ష్యాలు మారిపోవటంతో చివరకు మొత్తం వ్యవస్ధే కుప్పకూలే పరిస్దితి కనబడుతోంది. పోయిన డిసెంబర్లో విజయవాడ, గుంటూరులోని రెండు చౌక ధరల డిపోలను ప్రయోగాత్మకంగా విలేజ్ మాల్స్ గా మార్చి వాటిని రియల్ టైం గవర్నెన్స్ కు అనుసంధానించారు.


రాష్ట్రంలో 27710 చౌకడిపోలుండగా అందులో 500 డిపోలను ఆధునీకరించి విలేజ్ మాల్స్ గా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మాల్స్ లో అవసరమైన సరకులను కూడా డీలర్లు ఆన్ లైన్లోనే ఆర్డర్ ఇచ్చేయచ్చన్నారు. చంద్రబాబు కమీషన్ల కక్కుర్తి ఈ రూపంలో భయటపడింది రాష్ట్రంలో ఉన్న చౌక డిపోలను దశలవారీగా విలేజ్‌ మాల్స్‌గా మార్చి వాటిని కార్పొరేట్‌ సంస్థలతో అనుసంధానం చేసి రేషన్‌ పంపిణీలో సమూల మార్పులు చేయాలన్న ప్రభుత్వ ప్రయోగం విఫలమైంది.

 

👌🏻గత ఏడాది డిసెంబరు 12న సిఎం చంద్రబాబు నాయుడు సచివాలయం నుంచి విజయవాడ, గుంటూరుల్లో రెండు డిపోలను చంద్రన్న విలేజ్‌ మాల్స్‌గా మార్పు చేయగా వాటిని రియల్‌టైమ్‌ గవర్నెన్స్‌ ద్వారా ఆన్‌లైన్‌లో ప్రారంభించారు. వీటితో పాటు తొలి దశలో రాష్ట్రంలో ప్రతి జిల్లాలో 6500 డిపోలను ఆధునీకీకరించి చంద్రన్న విలేజ్‌ మాల్స్‌గా మార్చాలని నిర్ణయించారు. నాణ్యమైన సరుకులు ఆన్‌లైన్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చునని కూడా అదే రోజు చంద్రబాబు నాయుడు ప్రకటించారు.  అయితే మొదటి 10 నెలల్లో 235 డిపోలను మాత్రమే విలేజ్ మాల్స్ గా మార్చగలిగారు.

 

👌🏻కానీ ఎక్కడా వీటికి ప్రజాదరణలభించలేదు. రాష్ట్రంలో 27710 చౌక డిపోలుండగా 80 శాతం డిపోలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. 13 జిల్లాల్లో 6500 చంద్రన్న విలేజ్‌ మాల్స్‌ ఏర్పాటు లక్ష్యంగా నిర్ణయించగా గత 10 నెలల్లో కేవలం 235 డిపోలను మాత్రమే విలేజ్‌ మాల్స్‌గా మార్చగలిగారు. ప్రభుత్వం సరఫరా  రేషన్ కార్డలకు ఇచ్చే బియ్యం, పంచదార  లాంటి నిత్యావసర వస్తులన్నింటినీ కార్పొరేట్ సంస్ధలు అమ్ముకోవచ్చు. తమ వస్తువులను అమ్ముకునేందుకు స్ధలం, భవనాన్ని ఇచ్చినందుకు సదరు సంస్ధలు డీలర్లకు 8 శాతం కమీషన్ ఇస్తాయట.


అయితే, ఇప్పటి వరకూ ఏర్పాటైన 235 మాల్స్ లో కేవలం 111 మాల్స్ మాత్రమే ఒకరకంగా నడుస్తున్నాయి. మిగిలిన 124 డిపోలు అంతంత మాత్రంగానే నడుస్తున్నాయి. పైగా వివాదాల్లో ఇరుక్కున్నాయి. మాల్స్ లో అమ్ముడుపోయిన సరుకుల మొత్తాన్ని తమకు చెల్లించలేదని రిలయన్స్ సంస్ద డీలర్లపై  ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. సరే ఆ వివాదం నడుస్తోందనుకోండి అది వేరే సంగతి.


ఇప్పటికి ప్రారంభించిన 235 మాల్స్ వ్యాపారమే ఆశాజనకంగా లేదన్న కారణంతో మిగిలిన మాల్స్ ను ప్రారంభించేందుకు రిలయన్స్ ఆసక్తి చూపటం లేదని సమాచారం. ఈ మాల్స్ లో అమ్మే నిత్యవసరాల్లో ఎక్కువ సరుకులు అధిక ధరలున్నాయన్న కారణంగా ఎవరూ కొనటానికి ముందుకు రావటం లేదు. దాంతో చంద్రన్న విలేజ్ మాల్స్ ప్రయోగం భయంకరంగా ఫెయిల్ అయ్యిందనే చెప్పొచ్చు. అందుకే ఈ ప్రయోగం గురించి చంద్రబాబు ఎక్కడా కనీసం ప్రస్తావన కూడా తేవటం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: