ఏపీ రాజకీయాలలో తన పాదయాత్రతో తన పార్టీ గ్రాఫ్ ను అమాంతం పైకి పెంచేశారు వైసీపీ అధినేత జగన్. ముఖ్యంగా రాష్ట్రంలో ప్రజా సంకల్ప పాదయాత్ర వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి అలాగే ఆ పార్టీకి మద్దతుగా ఉన్న జనసేన బిజెపి పార్టీలకు తానేంటో నిరూపించారు జగన్. ఒకపక్క ప్రజలను ధైర్య పరుస్తూ మరోపక్క చంద్రబాబు ప్రభుత్వ అవినీతి పనులను బహిర్గతం చేస్తూ ముందుకు సాగుతున్నారు.

Image may contain: 5 people, people smiling, people standing, beard and outdoor

దీంతో జగన్ తలపెట్టిన ఈ ప్రజా సంకల్ప పాదయాత్ర ఏపీ ప్రజల్లో జగన్ ముఖ్యమంత్రి అయితే కచ్చితంగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని బలంగా నాటుకుపోయింది. ఈ విషయమే తాజాగా ఇటీవల ఓ ప్రముఖ జాతీయ మీడియా ఛానల్ సర్వేలో తేలింది. దేశంలోనే జాతీయ చానల్లో మొట్ట మొదటి స్థానంలో ఉండే రిపబ్లిక్ టీవీ ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికలను ప్రధానాంశంగా తీసుకుని ఓ సర్వే నిర్వహించింది.

Image may contain: 10 people, people smiling, people standing, shoes and outdoor

రిపబ్లిక్ టీవీ- సీఓటర్ సంస్థ నిర్వహించిన సర్వేలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఏకంగా 21 శాతం ఎంపీ స్థానాలు గెలుచుకోనున్నట్లు అంచనా వేసింది. ఇక అధికార తెలుగుదేశం పార్టీ కేవలం 4 స్థానాలు మాత్రమే గెలుచుకోనున్నట్లు తెలిపింది. ఇక కాంగ్రెస్, బీజేపీ ఖాతా కూడా తెరిచే అవకాశాలు లేనట్లు అంచనా వేసింది.

Image may contain: one or more people, crowd, sky and outdoor

ఇక ఓట్ల శాతానికి వస్తే జగన్ 41.9 శాతం ఓట్లు సాధించనున్నారని, తెలుగుదేశం పార్టీ 31.4 శాతం ఓట్లు, బీజేపీ 12.5 శాతం, కాంగ్రెస్ 7.2 శాతం, ఇతరులు 7 శాతం ఓట్లు సాధించే అవకాశం ఉందని సర్వే అంచనా వేసింది. ఇతరుల్లో జనసేన ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఇటీవల ఇండియా టూడే గ్రూప్ నిర్వహించిన ఫలితాల్లోనూ జగన్ కే ఆధిక్యత కనిపించిన విషయం తెలిసిందే. అయితే పాదయాత్ర ముగియకుండానే ఈ విధంగా వైసీపీ పార్టీ గ్రాఫ్ పేరిగిపోవడంతో వైసీపీ కార్యకర్తలలో నాయకులలో సంతోషం...రానున్న రోజుల్లో జగన్ కచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారని ధీమా నెలకొంది.




మరింత సమాచారం తెలుసుకోండి: