రేవంత్ రెడ్డి మీద ప్రస్తుతం ఐటీ దాడులు జరుగుతున్నాయి ఇప్పటికే విలువైన డాకుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కీలకంగా వినిపిస్తున్న అంశం ఏంటంటే.. ఈ మలివిడత ఐటీదాడులు మంత్రి నారాయణ మీదికి మళ్లడానికి సంబంధించి.. రేవంత్ రెడ్డి విచారణ పర్వంలో ఏమైనా లీడ్ ఇచ్చాడా? అనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. రేవంత్ రెడ్డిని అధికారులు విచారించినప్పుడు.. ప్రధానంగా... లంచంగా ఇవ్వజూపిన 50 లక్షల గురించే ప్రశ్నించారు.

Image result for revanth reddy

ఆ సొమ్ముకు సంబంధించి ఆయన ఏదో ఒక వాదన చెప్పి ఉండాల్సిందే. అది తన సొంతమే అని ఉంటే గనుక.. ఆదాయ వనరుల గరించి కూడా చెప్పి ఉండాలి.ఆ విచారణ పర్వంలో రేవంత్ నుంచి అనేక డాక్యుమెంట్లను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హార్డ్ డిస్క్ లను కూడా తీసుకువెళ్లారు. వాటిని శోధించడంలో నారాయణ పాత్ర ఏమైనా వెలికి వచ్చిందా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.

Image result for narayana tdp minister

అందుకే తమకు లీడ్ అందిన విషయం డిలేకాకముందే.. నారాయణ కాలేజీలు, ఆస్తులు, నివాసాలపై ఏకకాలంలో దాడులు మొదలెట్టినట్లు అనుకుంటున్నారు. మంత్రి నారాయణ చంద్రబాబునాయుడుకు చాలా సన్నిహితులైన, విశ్వసనీయులైన మంత్రుల్లో ఒకరు. తెదేపా 2014 ఎన్నికల్లో అధికారంలోకి రావడంలో.. ఆర్థిక వనరుల పరంగా ఆయన చాలా కీలకంగా వ్యవహరించారనే వాదన కూడా ఉంది. ఇలాంటి నేపథ్యంలో నారాయణ వ్యవహారాలు, వ్యాపారాల మీద ఐటీదాడులు సంచలనం కలిగిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: