రాజకీయ పార్టీల అధినేతలు అంటేనే తండ్రి స్థానంలో ఉండేవారు. వారి వద్దకు పార్టీ నాయకులు, క్యాడర్, అభిమానులు ఇలా అందరు వచ్చి కష్టాలు, నష్టాలు చెప్పుకుంటారు. వాటిని సరిగ్గా డీల్ చేసి న్యాయం చేస్తారని అధినేతలపై కొండంత నమ్మకంతో ఉంటారు. ఇక ఆశీర్వధించినా, ఆదేశాలు జారీ చేసినా వారే కాబట్టి వారి మాటే ఫైనల్ కాబట్టి ఆచీ తూచీ డెసిషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. పొరపాట్లు, తడబాట్లు జరిగితే భారీగానే మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది.


బాబు ఆరితేరారు :


పార్టీలో  పంచాయతీల విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఆరితేరిపోయారు. ఆయన వద్దకు వెళ్ళిన తరువాతా ఎటువంటి సమస్య అయినా పరిష్కారం అవుతుందన్న నమ్మకం క్యాడర్లో ఉంది. బాబు కూడా వీలైనంత వరకూ ఇరు వర్గాలకు న్యాయం  చేస్తారన్న పేరు ఉంది అందువల్ల టీడీపీలో ఎన్ని లుకలుకలు వచ్చినా అవి బాబు వద్దకు వెళ్తే మాత్రం టీ కప్పులో తుపాను లా ఉఫ్ న ఎగిరిపోతాయి. ఇపుడున్న నాయకుల్లో బాబు ఆ విషయంలో బెస్ట్ మేనేజ్మెంట్ స్కిల్స్ కలిగి ఉన్నారని అంతా ఒప్పుకుంటారు 


ఆ రూట్లో జగన్ :


ఇపుడు అదే రూట్లోకి జగన్ వెళ్తున్నారు.  పోయిన ఎన్నికల్లో పార్టీ నాయకుల మాటను పెద్దగా పట్టించుకోని జగన్ ఈసారి మాత్రం వారిని చేరదీస్తున్నారు. చెప్పిన మాటను వింటున్నారు. సమస్యలు వస్తే కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు. ఇది శుభ పరిణామమేనని పార్టీ వర్గాలు అంటున్నాయి. ముఖ్యంగా టికెట్ల పంపిణీ విషయంలో గొడవలు వస్తున్నాయి. వాటిని సరిదిద్దడంలో  జగన్ ఈసారి బాగానే చొరవ తీసుకుంటున్నారు.


సెటిల్మెంట్స్ పనిచేస్తాయా :


ఇక్కడ ఒకటే ప్రశ్న. జగన్ నాయకులను కూర్చోబెట్టి వ్యవహారం సెటిల్ చేస్తున్నారు. నీకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తాను అని ఒకరికి చెబుతూ, రెండవ వారికి మేయర్ లాంటి పదవులు, ఎమ్మెల్సీ , ఇతర నామినేటెడ్ పదవులు హామీ ఇస్తున్నారు. అయితే మొదటిది వెంటనే జరిగేది, రెండవది జగన్ అధికారంలోకి వస్తేనే జరిగేది. ఒకవేళ జగన్ పవర్లోకి వచ్చినా అప్పటికి ఈక్వేషన్లు ఎలా ఉంటాయో తెలియదు. దాంతో జగన్ చేసే ఈ సెటిల్మెంట్ వర్క్ ఎంతవరకు  సక్సెస్  అవుతుందన్నది చూడాల్సి ఉంది. 
జగన్ ముందు ఒకే అని నేతలు అన్నా బయటకు వచ్చి తోక జాడించినా. లేక పార్టీ విజయానికి సరిగా పాటు పడకపోయినా భారీగా నష్టపోవాల్సివుంటుంది. మరి జగన్ సెటిల్ చేసి ఊరుకుంటారా. ఆ వర్గాల మధ్య కోఆర్డినేషన్ కోసం మరేదైన చేస్తారా అన్నది చూడాలి. అలా గ్రౌండ్ లెవెల్లో జరిగితేనే జగన్ ప్లాన్ సక్సెస్ అయినట్లు.


మరింత సమాచారం తెలుసుకోండి: