ముందస్తు ఎన్నికలు తరుముకొస్తుండటంతో తెలంగాణలో కాంగ్రెస్ నేతలు తమ మాటల్లో పదును పెంచుతున్నారు. కేసిఆర్ తీవ్ర అనాగరిక వాదనలకు సమాధానంగా  టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబమే లక్ష్యంగా విమర్శల దాడులను తీవ్రతరం చేస్తున్నారు.  వారిపై పలుఅవినీతి ఆరోపణలు గుప్పిస్తు, ప్రజల దృష్టిని ఆకర్షిస్తు న్నారు టీఆర్ఎస్ ను దీటుగా ఎదుర్కునే సామర్థ్యం లేకపోవడం వల్లే ప్రత్యర్థి పార్టీలు తమ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుంటున్నాయని కేసీఆర్ కుమారుడు కేటీఆర్ ప్రతి విమర్శలు గుప్పిస్తున్నా, ప్రతిపక్షాలు ప్రధానంగా కాంగ్రెస్ వెనక్కి తగ్గడం లేదు.

Image result for kcr grandson himanshu visited secretariat

తాజాగా తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కేసీఆర్ కుటుంబంపై తీవ్ర ఆరోపణలు చేశారు. కొడంగల్లో ఆయనపై ఆయన బందువుల ఇళ్ళ పై జరిగిన ఐటి దాడులకు ముందు జరిగిన బహిరంగ సమావేశంలో వారిపై నిప్పులు చెరిగారు. కేటీఆర్ మామ పాకల హరినాథరావు చాలా ఏళ్ల క్రితం నకిలీ ఎస్టీ సర్టిఫికెట్ సృష్టించా రని దాని ద్వారానే ఆయన ప్రభుత్వ ఉద్యోగం పొందారని ఆరోపించారు. కొన్నేళ్ల క్రితం హరినాథరావు అటవీశాఖ అధికారిగా రిటైర్ అయ్యారని,  అయినా ఇప్పటికీ ఎస్టీ వ్యక్తి గా పింఛన్ తీసుకుంటున్నారని తెలిపారు.

Image result for kalvakuntla kavitha submitted affidavit to EC says don't have children

ఎస్టీలకు విద్య - ఉద్యోగాల్లో 12 శాతం రిజర్వేషన్ కల్పిస్తానంటూ కేసీఆర్ ఆర్భాటంగా చెబుతుంటారని అన్నారు. మరి తప్పుడు కుల ధ్రువీకరణ పత్రంతో ప్రభుత్వాన్ని మోసగించిన వియ్యంకుడు పాకల హరినాథరావుపై ఆయన చర్యలు తీసుకోగలడా? అని సవాలు చేశారు. ఎస్టీ వ్యక్తిగా పింఛను తీసుకుంటున్న వ్యక్తి  కుమార్తె ఎస్టీ కాదా? అని ప్రశ్నించారు. తన కోడలు శైలిమ లంబాడీ వ్యక్తి  లేదా ట్రైబల్ కాస్ట్ కు చెందిన కేసీఆర్ స్పష్టం చేయగలరా? అని ఛాలెంజ్ విసిరారు.

అధికారిక కార్యక్రమాలకు కేటీఆర్ కుమారుడు హిమాన్షు హాజరవటంపైనా రేవంత్ తీవ్ర విమర్శలు చేశారు. ఏ హోదా లో హిమాన్షు భద్రాచలం ఆలయానికి ప్రభుత్వం తరఫున దుస్తులు తీసుకెళ్లారో చెప్పాలన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయంలోకి సచివాలయంలోకి హిమాన్షు తన స్నేహితులతో కలిసి వచ్చేలా చొరవ ఇవ్వడాన్నిప్రశ్నించారు. పార్టీలో ప్రభుత్వంలో ఆ బాలుడి హోదా ఏంటో చెప్పాలంటూ నిలదీశారు.
Image result for kcr grandson himanshu visited secretariat

మరోవైపు 2014 లోక్ సభ ఎన్నికల సమయంలో కేసీఆర్ కుమార్తె నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు కల్వకుంట్ల కవిత ఎన్నికల కమిషన్ కు సమర్పించిన అఫిడవిట్ ను కాంగ్రెస్ నేతలు ప్రస్తుతం విస్తృత ప్రచారంలోకి తెస్తున్నారు. తనకు పిల్లలు లేరని, కాబట్టి వారి పేర్ల పై ఆస్తులు కూడా లేవని అఫిడవిట్ లో కవిత పేర్కొన్నట్లు వారు చెబుతున్నారు.

Image result for kcr grandson himanshu visited secretariat

వాస్తవానికి ఆమెకు ఇద్దరు కొడుకులున్న సంగతి అందరికీ తెలుసునని న్నారు. ఈసీ కి కవిత తప్పుడు అఫిడవిట్ సమర్పించారంటూ వారు విమర్శలు గుప్పిస్తున్నారు.

Related image

మరింత సమాచారం తెలుసుకోండి: