తాజాగా జాతీయ సంస్థలు చేసిన కొన్ని సర్వేలు ఏపీలో అన్ని పార్టీలకూ తలా కొంచెం ఓట్లను పంచుతున్నాయి కానీ సినీ నటుడు పవన్ కళ్యాన్ పార్టీని మాత్రం పట్టించుకోవడంలేదు. మరి సర్వేశ్వరుల సర్వేలో తప్పుందా.  లేక జనాలే ఆ పార్టీని పక్కన పెడుతున్నారా అన్నది తేలడం లేదు. ఇలా కనుక చూసుకుంటే జనసేన ఇంకా జనం బుర్రల్లోకి వెళ్లలేదా అన్న అనుమానాలు వస్తున్నాయ్. 


అవే చెబుతున్నాయి :


తాజాగా సీ ఓటర్ సర్వేలో కాంగ్రెస్ ఓట్ల గ్రాఫ్ బాగానే పెరిగింది. అతంకు ముందు  అయిదు లోపు ఉన్న ఓట్ల శాతం ఇపుడు ఏడున్నర  వరకు వచ్చింది. మరో జాతీయ పార్టీ బీజేపీని ఎంతగా చీదరించుకున్నా పన్నెడున్నర శాతం ఓట్లు చూపిస్తున్నారు. ఇక వైసీపీ అగ్ర స్థానంలో ఉంటే టీడీపీ వెనకబడింది. ఇవన్నీ పక్కన పెడితే జనసేన గురించిన ప్రస్తావన ఎక్కడా లేదు. అంతకు ముందు ఇండియా టు డే సర్వేలోనూ అలాగే ఉంది.


చూసేందుకేనా :


పవన్ మీటింగులకు జనం పోటెత్తుతున్నారు. ఏ నాయకుని లేని విధంగా క్రేజ్ ఉంది. మరి ఆయన కూడా అలుపెరగకుండా ప్రజా పోరాట యాత్రలు చేస్తున్నారు. ఇన్ని జరుగుతుంటే జనాలు జనసేన గురించి చర్చించుకోవడంలేదా  లేక పవన్ తన పార్టీ గురించి సరిగ్గా ప్రచారం చేసుకోవడంలేదా అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఇక పవన్ కి వచ్చే జనం హీరోగా చూసేందుకే తప్ప ఓట్లు వేసేదుకు కాదని ఈ మధ్యనే టీడీపీ ఎంపీ కేశినేని నాని సెటైర్లు వేశారు. అదే నిజమని భావించాలా


 సంస్థాగత నిర్మాణం లోటేనా :


జనసేన పార్టీ పరిస్తితి ఇలా ఉండడానికి కారణం సంస్థాగతంగా  నిర్మాణం లేకపోవడమేనని అంటున్నారు. పవన్ స్పీచ్ ఇచ్చిన తరువాత ఆ ఊపుని జనాల్లో కంటిన్యూ చేసే వాళ్ళూ లేకపోవడమే శాపంగా ఉందంటున్నారు. పవన్ కూడా ఎక్కువగా టీడీపీ, వైసీపీలను నిందించడం తప్ప తన పార్టీ గురించి విధానాల గురించి చెప్పుకోలేకపొతున్నారని అంటున్నారు. వేలాదింగా వచ్చిన జనాలకు తన సిధ్ధాంతాలను వివరించడంలో ఫెయిల్ అవుతున్నారాని చెబుతున్నారు.
ఇప్పటికైతే మించిపోయింది ఏమీ లేదు. పవన్ ఇకనైనా జనాల్లో తన పార్టీ గురించి ఎక్కువగా ప్రచారం చేయడం ద్వారానే రేపటి ఎన్నికల్లో లాభం పొందగలరు. ఈ సర్వే ఫలితాలను జనసేన పాజిటివ్ గా తీసుకుని ముందుకు కదలాల్సిఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: