చంద్రబాబునాయుడుకు బాగా సన్నిహితుడైన మంత్రి నారాయణపై ఐటి దాడులు జరిగాయి. ఈరోజు ఉదయం నారాయణకు చెందిన నెల్లూరు, విజయవాడలోని విద్యాసంస్ధలపై ఏకాకలంలో ఐటి శాఖ ఉన్నతాధికారులు దాడులు చేశారు.  కొందరు మంత్రులు, నేతలపై ఐటి దాడులు జరగవచ్చని, అప్రమత్తంగా ఉండాలంటూ చంద్రబాబు హెచ్చరించిన నేపధ్యంలో మొదలైన ఐటి దాడులు సంచలనంగా మారింది.

 

ఓటుకునోటు కేసులో కీలక పాత్రదారి రేవంత్ రెడ్డి ఇంటిపై నాలుగు రోజుల క్రితం ఐటి దాడులు జరగటంతో చంద్రబాబులో కూడా ఆందోళన మొదలైంది. అదే కేసులో తనను లక్ష్యంగా చేసుకుని కేంద్ర, తెలంగాణా ప్రభుత్వాలు తనపై కుట్ర పన్నుతున్నట్లు చంద్రబాబు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఓటుకునోటు కేసులో తన పాత్ర లేదని స్పష్టంగా చెప్పని చంద్రబాబు తనపై కుట్ర జరుగుతోందిన మాత్రం పదే పదే చెబుతూ జనాల సానుభూతి పొందేందుకు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిపోతోంది.

 

ఓటుకునోటు కేసులో రేవంత్ 50 రూ లక్షలతో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన విషయం తెలిసిందే.  ఓటుకు కోసం బేరం కుదుర్చుకున్న మొత్తం రూ 5 కోట్లు ఎవరివి ? బేరం కుదుర్చుకున్న రూ 5 కోట్లు ఎక్కడివి అన్న సమాచారం రాబట్టేందుకే  ఐటి అధికారులు రేవంత్ ను విచారిస్తున్నారు. అందులో భాగంగానే అప్పట్లో రేవంత్ కు డబ్బులు సమకూర్చారంటూ ప్రచారం జరిగిన సిఎం రమేష్, సుజనా చౌదరి, బీద మస్తాన్ రావు, నారాయణ, గరికపాటి మోహన్ రావులపై కూడా ఐటి దాడులు జరగచ్చని అందరూ అనుమానిస్తున్నారు.

 

వారంతా ఇపుడు ఏపిలోనే ఉన్నారు. అందుకే వారిపై ఐటి దాడులు జరిగే అవకాశాలున్నాయని చంద్రబాబు పదే పదే హెచ్చరిస్తున్నది. అందులో భాగంగానే ఈరోజు నారాయణ, మూడు రోజుల క్రితం నెల్లూరు, చెన్నైకి చెందిన బీద మస్తాన్ రావు ఇళ్ళు, కార్యాలయాలపైన కూడా ఐటి దాడులు జరగటంతో మంత్రులు,  నేతల్లో  టెన్షన్ పెరిగిపోతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: