నిన్న తెలంగాణాలో ఐటీ దాడులు జరిగాయి. ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌ టీడీపీ నేతలు, మంత్రుల ఇళ్లను టార్గెట్‌ చేసినట్లు సమాచారం. పోలీసుల బందోబస్తుతో గుంటూరు, నెల్లూరు, విజయవాడ ప్రాంతాల్లో ఏకకాలంలో ఐటీ అధికారులు విస్తృత స్థాయిలో దాడులు నిర్వహిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. కానూరులోని నారాయణ అడ్మినిస్ట్రేషన్‌ కార్యాలయానికి ఐటీ అధికారులు చేరుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఐటీ దాడుల వార్తలను మంత్రి నారాయణ ఖండించారు. తమ విద్యాసంస్థలపై ఇప్పటి వరకు ఎలాంటి ఐటీ దాడులు జరగలేదని తెలిపారు. 


అక్కడే దాడులు :


అలాగే సదరన్‌ డెవలపర్స్‌, వీఎస్‌ లాజిస్టిక్‌ కంపెనీలకు సంబంధించిన కార్యాలయాల్లోనూ సోదాలు జరుగుతున్నాయి.  వీఎస్ లాజిస్టిక్స్ గుంటూరులో రైల్వేకోచ్‌ల మరమ్మతులు, రైల్వే నిర్మాణ పనులకు సబంధించిన కాంట్రాక్టులు చేస్తోంది. విశాఖపట్నం, హైదరాబాద్, గుంటూరులో ఈ రెండు సంస్థల కార్యాలయాలు, సంస్థ ప్రతినిధుల ఇళ్ళలోనూ తనిఖీలు జరుగుతున్నాయి. అమరావతి, పోలవరం కాంట్రాక్టుల్లో సబ్ కాంట్రాక్టు పనులను సదరన్ డెవలపర్స్ నిర్వహించినట్లు సమాచారం. విజయవాడలోని ఆటోనగర్‌లో ఉన్న ఐటీ జాయింట్ డైరెక్టర్ కార్యాలయం నుంచి  మొత్తం పది బృందాలుగా అధికారులు తనిఖీలకు వెళ్లారు.


ఊహాగానాలతో బేజారు :


ఈ రోజు  ఉదయం ఏడున్నర గంటలకు ఐటీ అధికారులు సోదాలు ప్రారంభించారు. రాజకీయ నేతలపై ఈ సోదాలు జరుగుతాయంటూ పెద్దయెత్తున ప్రచారం జరిగినా ఐటీ అధికారులు వాటిని ఖండించారు. కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేటలో ఉన్న ప్రీకాస్టింగ్‌, ఇటుకల తయారీ కంపెనీపై కూడా ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. మొత్తం 7 బృందాలుగా విడిపోయిన ఐటీ అధికారులు గుంటూరు, విజయవాడ, కృష్ణా జిల్లాలో ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఐటీ సోదాలు జరుగుతాయంటూ ప్రచారం జరగడంతో పాటు రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరగవచ్చంటూ ఊహాగానాలు చెలరేగాయి. అయితే ఐటీ శాఖ మాత్రం ఈ వదంతులు అవాస్తవమని తేల్చిచెప్పింది.


గుండెల్లో గుబులు


కాగా ఈ దాడులతో టీడీపీ గుండెల్లో గుబులు రేగుతోంది. మంత్రులు నుంచి సీనియర్ లీడర్ల వరకు వణుకుతున్నారు. ఎవరి కొంప ముచుతాయోనని కూడా చర్చించుకుంటున్నారు. కాగా ఇంతకు రెండు రోజుల ముందే టీడీపీ నేతలతో బాబు మాట్లడినపుడే ఐటీ దాడులు ఏపీకి విస్తరించే ప్రమాదం ఉందని వూహించారు. ఇపుడదే జరుగుతోంది. ఈ దాడులతో ఎవరి గుట్టు రట్టు అవుతుందో చూడాలి. ఈ దాడులపై లలోపల మల్లగుల్లు పడుతున్నా టీడీపీ పెద్దలెవరూ బయటకు పెదవి వీపడంలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: