రాజకీయాలకూ చావులకూ కూడా మంచి టైమింగ్ ఉంది. ఫాంలో ఉన్న నాయకుడు చనిపోతే ఆ క్రేజ్ వేరుగా ఉంటుంది. అదే ఔట్ డేటెడ్ అయి పోతే ఆ రెస్పాన్స్ లో తేడా కొట్టేస్తుంది. శవ రాజకీయాలంటూ ఎవరెంతగా బయటకు అన్నా అందరూ చేసేది అదే. సెంటిమెంట్ తో ఓటర్లను కొట్టడం అన్నది ఇప్పడిది కాదు, ఎప్పటికీ పోదు.


ఏజెన్సీ కోసం స్కెచ్ :


ఏజెన్సీలో టీడీపీ పట్టుకోల్పోయిన టైంలో వైసీపీ ఎమ్మెల్యే కిడార్ సర్వేశ్వరరావుని సైకిలెక్కించి బలం తెచ్చుకుంది టీడీపీ. కిడారి కూడా అధికార పార్టీలో హవా చాటుకుంటూ తన ఆధిక్యతను చాటుకుంటూ వచ్చారు. ఆయనను మంత్రిని చేస్తామని జంపింగ్ చేయించారు. తీరా ఇచ్చింది మాత్రం ప్రభుత్వ విప్ పదవి. ఆ పదవిలో ఉండగానే మావోయిస్టులు కిడారిని దారుణంగా హత్య చేశారు. దీంతో ఇక్కడ సెంటిమెంట్ పండించాలని టీడీపీ స్కెచ్ వేస్తోంది.


మంత్రిని చేస్తారా :


చెప్పాలంటే పోయిన ఎన్నికల్లో టీడీపీ తరఫున గిరిజన ఎమ్మెల్యేలు పెద్దగా గెలిచింది లేదు. పశ్చిమ గోదావరిలో ముడియం బాబూరావు తప్ప. వైసీపీ నుంచి మాత్రం ఏకంగా ఏడుగురు గెలిచారు. దాంతోనే గిరిజన సలహా మండలిని కూడా టీడీపీ వేయలేదని అంటారు. ఇదిలా ఉండగా మంత్రిని చేస్తామని తెచ్చిన కిడారిని సైడ్ చేశారు. ఇపుడు ఆయన దారుణంగా చనిపోవడంతో ఆయన కుమారుణ్ణి మంత్రిని చేస్తారని టాక్ నడుస్తోంది.కిడారి పెద్ద కుమారుడు శ్రావణ్ ని మంత్రిని చేస్తారని ప్రచారం నడుస్తోంది. ఇంజనీరింగ్ చదివిన కిడారి శ్రావణ్ ని రేపటి విస్తరణలో అమాత్య పీఠం ఎక్కించాలని చూస్తున్నారు. 


ఇదీ లెక్క :


ఏ సభలో సభ్యుడు కాకపోయినా మంత్రి కావచ్చు. ఆరునెలల్లో ఎన్నికల్లో గెలిచి ఆ పదవి కాపాడుకోవచ్చు. ఈ రాజ్యాంగ నిబంధనను అనుసరించి కిడారిని ఈ నెలలో జరిగే విస్తరణలో మంత్రిని చేస్తారట. ఏపీలో ఎస్టీలకు  ఇప్పటివరకూ మంత్రి పదవి లేదు. ఆ లోటును భర్తీ చేయడంతో పాటు కిడారి కుటుంబానికి ఇవ్వడం ద్వారా సానుభూతిని కొట్టేయవచ్చు అని టీడీపీ భావిస్తోందట. ఆరు నెలలు అయ్యేటప్పటికి ఎన్నికలు ఎలాగూ వస్తాయి.
అప్పటికి మంత్రి పదవికి రాజీనామా చేయించి మాజీ మంత్రి హోదాలో టికెట్ ఇచ్చి జనంలోకి వదిలితే కిడారి కొడుకు మన్యం సీట్లు మొత్తం తెస్తాడని టీడీపీ మాస్ట‌ర్ ప్లాన్ వేస్తోంది. మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో  చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: