ఏపీ లో జరుగుతున్న ఐటీ దాడులు విషయమై మరియు అదే విధంగా తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలు విషయం గురించి ఏ పి క్యాబినెట్ సమావేశమయింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులతో రాష్ట్రంలో జరుగుతున్న ఐటీ దాడులు విషయమై కొన్ని ఆదేశాలు జారీ చేశారు.

Related image

ఎటువంటి పరిస్థితులు ఎదురైనా అన్నిటిని ఎదుర్కొనే విధంగా ఉండాలంటే అధికారులకు మంత్రులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న ఐటీ దాడులు కేంద్ర కక్ష సాధింపు చర్య లేనని పేర్కొన్నారు. ఎన్నికల ముందు ఐటీ దాడులు నిర్వహించి తెలుగుదేశం పార్టీ పరువును అలాగే రాష్ట్ర పరువును తీయాలని కేంద్రం భావిస్తుందని పేర్కొన్నారు.

Related image

రాజకీయ దాడులకు సపోర్టు చేసేది లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంపై అన్ని స్థాయిల్లో పోరాటానికి సిద్ధంగా ఉండాలని కేబినెట్‌కు సూచించారు. మరోవైపు లా అండ్‌ ఆర్డర్‌ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమన్నా చంద్రబాబు నాయుడు ఐటీ దాడుల నేపథ్యంలో ఐటీ అధికారులకు సెక్యూరిటీ విత్‌ డ్రా చేసుకుంటామని తెలిపారు.

Image result for chandrababu

అంతేకాకుండా కేంద్ర రాష్ట్ర సంబంధాలను దెబ్బతీస్తున్నారనే అంశపై సుప్రీం కోర్టుకు వెళ్లే అవకాశాన్ని పరిశీలించాలని లా సెక్రటరీని చంద్రబాబు ఆదేశించారు. మరోపక్క ఐటీ దాడులు ఎక్కువగా అధికార పార్టీకి చెందిన నేతల పై జరుగుతున్న నేపథ్యంలో టిడిపి నాయకులు అందరూ ముందు జాగ్రత్తలు తీసుకుంటూ ఎక్కడికక్కడ అలర్ట్ గా ఉంటున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: