ఇక ఫోరెన్సిక్ నివేదికలు, ఇతర సాక్ష్యాలు అవసరం లేదు. అసలు ఆసామే డైరెక్ట్ గా రంగంలోకి దిగిపోయి బస్తీ మే సవాల్ చేసాక  విషయం ఏంటో జనాలకు పూర్తిగా అర్ధమైపోయింది. నిజమే కానీ అంతా అక్కడితోనే అడిగి ఆగిపోవడమే చిత్రాతిచిత్రం. ఎవరూ కూడా దాన్ని ఖండించకపోవడం ఇంకా  చిత్రం. కేవలం దూషణ భూషణలకే పరిమితం కావడమూ విశేషమే.


నీ గొంతే అది బాబూ :


అంటున్నారు కేసీయార్. ఆయన తెలంగాణా సీఎం. మూడున్నరేళ్ళ క్రితం అక్కడ జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో  కొనుగోళ్ళకు తెరలేపి టీడీపీ అడ్డంగా దొరికిపోయిన కధ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇపుడు అది మరో సారి బయటకు ఇలా వచ్చింది. ఓ వైపు తెలంగాణా ఎన్నికలు రాజుకుంటున్న వేళ మహబూబ్ నగర్ మీటింగులూ కేసీయార్ ఆ గొంతు బాబుదేనన్ని డిక్లేర్ చేయడం విశేషం. మా వాళ్ళు బీఫ్డ్ మీ అంటూ బాబు ఫోన్ లో అన్న మాటలు నాడూ నేడూ సంచలనమే.


ప్రూఫ్ అయినట్లెగా :


ఇంతవరకూ అందరూ ఆరోపించినది వేరు. ఏకంగా తెలంగాణా పెత్తందారుగా కేసీయార్ మాట్లాడింది వేరు. ఎందుచేతనంటే ఆ కేసు డీల్ చేస్తోందే కేసీయర్ సర్కార్. మరి బాబు గొంతు విషయంలో నిర్ధారించిన ఫోరెన్సిక్ నివేదిక కూడా ఆయన దగ్గర ఉండే ఉంటుంది. అందుకే అంత ధైర్యంగా బాబు అది నీ గొంతుకే అని బహిరంగ సభలో ఎలుగెత్తి కేసీయార్ చాటారు. అక్కడితో ఆగకుండా నీదీ ఓ బతుకేనా అంటూ చెడా మడా కడిగిపారేశారు. మిగిలిన వాటి సంగతి పక్కన పెడితే అది బాబు గొంతు అన్నది మరో మారు రుజువైంది.


డొంక తిరుగుడు ఎందుకు :


నిజానికి బాబు గొంతు అది అని ఫొరెన్సిక్ నివేదిక కాదు, చిన్న పిల్లవాడిని అడిగినా చెబుతాడు. అంతెందుకు ఇప్పటివరకూ చంద్రబాబు కూడా అది నా గొంతు కాదని చెప్పలేదే. ఆ పార్టీ కొత్త ఎంపీ, సీనియర్ లాయర్ కనకమేడల కూడా ఓటుకు నోట్  కేసు ఏం లేదు, ఏం కాదు అంటున్నారే తప్ప అది బాబు గొంతు కానే కాదని చెప్పలేకపోతున్నారుగా. ఇక టీడీపీ తమ్ముళ్ళు కూడా ఆ గొంతు విషయంలో గొంతు విప్పలేకపోతున్నారు కదా.


గొంతు సవరించాల్సిందే :


ఇక ఇంతదాక వచ్చాక గొంతు సవరించి ఆ గొంతు నాది కాదు అని చెప్పుకోవాల్సింది చంద్రబాబే. ఇప్పటికైనా ఆ మిస్టరీ విప్పాల్సింది ఆయనే. నిజాయతీ, నిప్పు అని చెప్పుకునే బాబు ఈ విషయంలో క్లారిటీ ఇస్తే ఆయన ఖ్యాతి పెరుగుతుంది. ఓటుకు నోటు కేసు ఏం కాదని ఆయన పార్టీ న్యాయ నిపుణులే తేల్చెస్తున్న వేళ బాబు ధైర్యంగా నిజం అయినా  చెప్పాలి, గొంతు తనది అని అయినా ఒప్పుకోవాలి. దీని వల్ల ఆయన వీరుడు, ధీరుడుగా వర్తమాన రాజకీయాల్లో నిలిచిపోతారు.
అంతే కాదు. కేసీయర్ తో సహా ఏపీ ప్రతిపక్షాలు, బాబు అంటే గిట్టని వారు ఇకపై ఆ  కామెంట్స్ చేసేందుకు వీలు లేకుండా ఉంటుంది. మరి బాబు ఇప్పటికైన ఆ బ్రీఫింగ్ మీద బ్రీఫింగ్ ఇస్తారా...



మరింత సమాచారం తెలుసుకోండి: