వచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయ దుందుభి మోగిస్తుందని సర్వేలు ఓ వైపు ఘొషిస్తున్నాయి. మరో వైపు జగన్ అలుపెరగని తీరులో పాదయాత్ర చేస్తున్నారు. రాజకీయం ఇపుడు క్లైమాక్స్ లోకి చేరుకుంటోంది. ఆటకు వేళాయేరా అంటూ పాలిటిక్స్ పిలుస్తున్న వేళ అధినేతలు అన్ని సర్దుకుంటున్నారు. వైసీపీలోనూ జగన్ తెర వెనక మంత్రంగాం బాగానే చేస్తున్నారు. ఎన్నికలకు రెడీ అయిపోతున్నారు. 


సిట్టింగులకు టికెట్లు :


వచ్చే ఎన్నికల్లో సిట్టింగు ఎంపీలందరికీ టికెట్లు ఇవ్వాలని జగన్ డిసైడ్ అయ్యారట. పార్టీ ఫిరాయించిన వారు కాకుండా ప్రత్యేక హోదా కోసం త్యాగం చేసిన అయిదుగురు ఎంపీల విషయంలో జగన్ లేటెస్ట్ గా నిర్ణయం తీసుకున్నారట. ఆ విధంగా చూసుకుంటే నెల్లూరు  నుంచి మేకపాటి, తిరుపతి నుంచి వరప్రసాద్, రాజంపేట నుంచి మిధున్ రెడ్డి, ఒంగోలు నుంచి వైవీ సుబ్బారెడ్డికి టికెట్లు కన్ ఫార్మ్ అని వైసీపీ శిబిరం నుంచి టాక్ నడుస్తోంది


అక్కడ చేంజ్  :


ఇక జగన్ సొంత జిల్లా కడప విషయంలో మాత్రం మార్పు ఉంటుందట. జగన్ కజిన్ బ్రదర్ అవినాష్ రెడ్డిన్ మార్చి తన బాబాయ్ వివేకానందరెడ్డికి ఎంపీ టికెట్ ఇస్తారని గట్టిగా  వినిపిస్తోంది. ఎందుచేతనంటే అవినాష్ పనితీరు జగన్ కి అంత త్రుప్తిగా లేదుట. ఆయన దూకుడు రాజకీయం చేయలేకపోవడం వల్లనే కడపలో టీడీపీ దూసుకువస్తోందని జగన్ భావిస్తున్నారుట. ఆ ఒక్క సీటు తప్ప మిగిలిన నలుగురూ మళ్ళీ ఎంపీ క్యాండిడేట్లేనంట.


కొత్త వారేనట :


ఈసారి ఎంపీ సీట్లను కొత్త వారికే ఎక్కువగా ఇవ్వాలని జగన్ డిసైడ్ అయ్యారట. వాళ్ళ వల్ల పార్టీకి ఫ్రెష్ లుక్ రావడంతో పాటు గెలుపు అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయని భావిస్తున్నారు. పోయిన ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వారిని పక్కన  పెట్టి జగన్ ఈ ప్రయోగం చేయబోతున్నారట. అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాల్సి ఉంది.
 ఏది ఏమైనా జగన్ తెర వెనక కసరత్తు బాగానే చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో 21 ఎంపీ సీట్లు వైసీపీ గెలుచుకుంటుందన్న సర్వేల అంచనాలతో జగన్ ఆచీ తూచీ అభ్యర్ధుల ఎంపిక చేస్తరాని అంటున్నారు. కేంద్రంలో ఏ పార్టీకి మెజారిటీ రాని వేళ ఈ ఎంపీలు చాల కీలకంగా మారుతారని భావిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: