అవును!  ఆయ‌న ఏం మాట్లాడినా ఐదు కోట్ల మంది ఏపీ ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌న‌మే ఉంటుంద‌ని చెప్పుకొంటారు. ఏ వేదికెక్కినా.. ఏం మాట్లాడినా.. తాను రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోస‌మే మాట్లాడుతున్నాన‌ని చెబుతున్నారు. అయితే, వాస్త‌వానికి ఆయ‌న చెబుతున్న దానికి చేస్తున్న దానికి సంబంధం లేద‌నిఅంటున్నారు ప‌రిశీల‌కులు. ఇంత‌కీ ఆయ‌నెవ‌రంటే.. ఏపీ సీఎం చంద్ర‌బాబు. అవినీతిపై పోరాటం చేయాల‌ని అంటారు. అంతేకాదు, నిన్న మొన్న‌టి వ‌రకు కూడా కేంద్రం అవినీతిని స‌హిస్తోంద‌ని చెప్పారు. తీరా కేంద్రం రంగంలోకి దిగి.. ప‌ని ప్రారంభించే స‌రికి మాత్రం మ‌ళ్లీ బాబు ఇది అన్యాయం.. అంటూ రోడ్డెక్కారు. నిజానికి ఏపీలో జ‌రుగుతున్న అవినీతి విస్తృతంగా ఉంద‌ని పేర్కొంటూ ప‌లు స‌ర్వే సంస్థ‌లు కూడా వెల్ల‌డించాయి. 


ముఖ్యంగా రాజ‌ధాని భూముల పేరుతో జ‌రుగుతున్న అవినీతి, రియ‌ల్ ఎస్టేట్‌, రెవెన్యూ విభాగాలు ఇలా ప్ర‌తిచోటా.. అవి నీతి ఏరులై పారుతోంది. అధికార పార్టీలోని చోటా నేత‌ను క‌దిలించినా క‌ట్టలు బ‌య‌ట‌ప‌డుతున్నాయి మ‌రి ఇలాంటి ప‌రిస్థితిలో అంత ఆదాయం ఎక్క‌డి నుంచి వ‌చ్చింది? అని ప్ర‌శ్నించ‌డ‌మే పాపం అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు చంద్ర‌బాబు. దేశంలో ఐటీ అధికారులు, ఏసీబీ అధికారులు, సీబీఐ అధికారులు, ఈడీ అధికారులు ఇలా.. ఏ వ్య‌వ‌స్థ అయినా కేవ‌లం ప్ర‌తిప‌క్ష వైసీపీ కోస‌మే ఏర్పాటు చేయాల‌ని, ఆ పార్టీనే టార్గెట్ చేయాల‌ని చంద్ర‌బాబు భావిస్తున్నారు. అంతేకాదు, ఏపీలో మ‌రో పార్టీ ఉండేందుకు కూడా ఆయ‌న సుత‌రాము ఒప్పుకొనే ప‌రిస్థితి లేదు. కేవ‌లం తెలుగు వారు సైకిల్‌నే న‌మ్ముకోవాలి.. వ‌రుస పెట్టి పెద్ద‌బాబు.. చిన్న‌బాబు.. బుల్లిబాబుల‌నే సీఎంలుగా చేస్తూ ఉండాలి. చూస్తూ ఉండాలి!


తాజాగా కేంద్రం నుంచి వ‌చ్చిన ఐటీ అధికారులు త‌మ డ్యూటీని తాము చేస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉ న్నా.. ఆదాయ‌పు ప‌న్ను స‌రిగా చెల్లించ‌క‌పోయినా..  కొర‌డా ఝ‌ళిపించ‌డం వారి విధి. దీనికి చంద్ర‌బాబు ఇంత హ‌డా వుడి చేసి.. రాష్ట్ర ప్ర‌భుత్వంపై కుట్ర సాగుతోంద‌ని ప్ర‌చారం చేసుకోవ‌డం చాలా సిల్లీగా ఉంది. నిజానికి స‌రైన విధానాలు పా టించి ఉంటే.. ఏ అధికారులు ఎన్నిత‌నిఖీలు చేసినా మునిగేకొంప‌లు ఉండ‌వు క‌దా?! మ‌రి ఈ విష‌యం తెలిసి కూడా చంద్ర‌బాబు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు.. గుమ్మ‌డికాయ‌ల దొంగ‌ను త‌ల‌పిస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించాలంటే.. ఎదుటివారిపై రాళ్లేస్తే.. కార‌నే విష‌యం బాబుకు తెలియంది కాదు. కానీ, ప్ర‌తి విష‌యానికీ ఆయ‌న మోడీని రంగంలోకి దింప‌డం స‌రైన విధానం కాద‌ని అంటున్నారు విశ్లేష‌కులు. కేంద్రంతో రాష్ట్రాల‌కు సంబంధం తెంచుకోవ‌ల‌సి వ‌స్తే.. గ‌తంలో త‌మిళ‌నాడు సీఎంగా ఉన్న క‌రుణానిధి చేసేవార‌ని, ఆయ‌న‌వ‌ల్లే ఏమీ కాలేద‌ని అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: