రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాల్లో తెలుగుదేశంపార్టీ పరిస్ధితి తేలుకుట్టిన దొంగలాగ అయిపోయిందా ? అందరిలోనూ ఇపుడదే అనుమానం మొదలైంది. గడచిన రెండు రోజులుగా విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, శ్రీకాకుళం, నెల్లూరు, చెన్నై తదితర ప్రాంతాల్లో ఐటి దాడులు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. దాడులన్నీ కేవలం వ్యాపార సంస్ధల మీదే జరుగుతున్నాయి.  ఐటి అధికారులు జరిపిన దాడుల్లో ఒక్కరంటే ఒక్కరు టిడిపి నేత కూడా లేరు.

అయినా సరే, చంద్రబాబునాయుడు దగ్గర నుండి గల్లీ నేత వరకూ ఐటి దాడులకు వ్యతిరేకంగా రెచ్చిపోతున్నారు. ఇక్కడే అందరిలోనూ అనుమానాలు మొదలయ్యాయి. ఎవరి మీదో ఐటి దాడులు జరిగితే చంద్రబాబు, మంత్రులు ఎందుకు అంతలా రెచ్చిపోతున్నారు ? ఎందుకంటే, వైసిపి నేతల ఆరోపణల ప్రకారం ఐటి దాడులకు గురైన సంస్ధల యాజమాన్యాలంతా టిడిపి ముఖ్యలకు బినామీలట. టిడిపిలోని పలువురు కీలక నేతలు తమ పెట్టుబడులను ఎవరి పేర్లమీదో పెట్టి వ్యవహారాలు నడుపుతున్నారట.

 తమ బినామీలపైన ఐటి దాడులు జరుగుతుంటే టిడిపి నేతలు తట్టుకోలేకపోతున్నారట. ఎందుకంటే, దాడుల్లో వాళ్ళు గనుక నోరిప్పితే తమ బండారమంతా బయటపడుతుందనే ఆందోళన పలువురు టిడిపి నేతల్లో మొదలైందట. అందుకనే ముందు జాగ్రత్తగా తమకు మద్దతుగా నిలబడే మీడియా అండతో రెచ్చిపోతున్నారని వైసిపి నేత వాసిరెడ్డి పద్మ ఆరోపిస్తున్నారు. క్షత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు కూడా పద్మ ఆరోపణలకు వత్తాసుగానే కనిపిస్తున్నాయి. పద్మ ఆరోపణల్లో నిజాలు బయటకు రావాలంటే కొంత కాలం వేచి ఉండక తప్పదు లేండి.


మరింత సమాచారం తెలుసుకోండి: