ఎన్నికల వేళ జంపింగులు మాములే. అయితే అధికార పార్టీలో కీలకంగా ఉన్న నేతలు జంప్ చేస్తే అదొక బిగ్ న్యూస్ అవుతుంది. అలాంటి  వార్తే ఒకటి ప్రచారంలోకి వచ్చింది. ఏపీ రాజధాని ప్రాంతంలో ఉన్న ఓ ముఖ్య ఎమ్మెల్యే జెండా ఎత్తేస్తున్నారని టాక్ నడుస్తోంది. ఆయన అధికార పార్టీపై తీవ్ర అసంత్రుప్తితో ఉన్నారని అంటున్నారు. తొందరలోనే అది బద్దలు అవుతుందనీ చెబుతున్నారు.


మోదుగుల జంపింగ్ :


టీడీపీ గుంటూర్ జిల్లా ఎమ్మెల్యే మోదుగున వేణుగోపాలరెడ్డి వైసీపీలోకి చేరిపోతారని అంటున్నారు. ఆయన సైకిల్ దిగే రోజు త్వరలోనే ఉందని చెబుతున్నారు. మోదుగుల టీడీపీలో ఎంపీగా కూడా పనిచేశారు. అటువంటి ఆయన్ని 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా బరిలోకి దింపిన టీడీపీ హై కమాండ్ మంత్రిని చేస్తామని హామీ ఇచ్చిదని చెబుతున్నారు. అయితే హామీ మాట దేముడెరుగు ఏకంగా మోదుగులనే పక్కన పెట్టేశారని ఆవేదన చెందుతున్నారు.


అక్కడ నుంచి పోటీ :


ఇక మోదుగుల వైసీపీలో చేరేందుకు మానసికంగా సిధ్ధమైపోయారని టాక్. ఆయన గుంటూర్ ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్నట్లు భోగట్టా. ఎంపీగా అయనకు వైసీపీలో చాన్స్ ఉంటుందో  లేదో తెలియడంలేదు. ఎందుచేతనంటే జగన్ గుంటూర్, నరసారావుపేటల ఎంపీ  అభ్యర్ధులను అనధికారికంగా డిసైడ్ చేసేశారని అంటున్నారు.మరి మోదుగులను ఏ హామీతో చేర్చుకుంటారో తెలియడంలేదు.


మరింతమంది :


ఇదిలా వుందగా వైసీపీలో చేరే వారి సంఖ్య ఇంకా పెరుగుతుందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ఒంగోలు జిల్లా నుంచి టీడీపీ ఎమ్మెల్యే ఆమంచి కూడా వైసీపీలోకి చేరేందుకు రెడీగా ఉన్నారని చెబుతున్న్నారు. చీరాల ఎమ్మెల్యెగా ఉన్నా అయన ఇండిపెండెంట్ గా గెలిచి ఆనక టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు. మారుతున్న రాజకీయ సమీకరణల్లో ఆయన సైకిల్ దిగేసి ఫ్యాన్ నీడన సేదతీరాలి అనుకుంటున్నారని టాక్. మరి చూడాలి ఇంకెంతమంది వస్తారో.


మరింత సమాచారం తెలుసుకోండి: