కరీంనగర్ టీఆర్ఎస్ నేత గంగుల కమలాకర్ ఈ ఉదయం తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.  నేడు  ఆయన మానేరు డ్యాంలో బోటింగ్‌కు దిగారు. దీంతో ప్రమాద వశాత్తు నీటిలో పడిపోయారు. సేఫ్ జాకెట్స్ వేసుకోవడంతో ఆయనతో క్షేమంగా బయటపడ్డారు. మానేరు డ్యామ్ లో బోట్ ఎక్కబోతున్న క్రమంలో కాలుజారి నీటిలో పడిపోయారు. అలా రెండు సార్లు జరిగింది. ఆ పక్కనే ఉన్న సిబ్బంది ఆయన్ను బయటకు తీశారు. 

మొత్తానికి ఎలాంటి ప్రమాదం లేకుండా ఆయన సేఫ్ అయ్యారు.  వాస్తవానికి గంగుల కమలాకర్ మానేరు డ్యామ్ లో  బోటింగ్ ను ప్రారంభించాల్సి వుంది. ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో, అధికారులే ఆ పని ముగించారు. రెండు స్పీడ్ బోట్లను ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. 

అయితే ఈ ఉదయం బోటింగ్ లో కాసేపు సరదాగా బోటింగ్ చేయాలని గంగుల భావించారు.  ఆ క్రమంలోనే కాలుజారి డ్యామ్ లో పడిపోయారు. ఆ సమయంలో ఆయన సేఫ్టీ జాకెట్ ధరించి ఉండటంతో ప్రమాదం నుంచి బయట పడ్డారు.  గంగుల సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: