అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తెలంగాణా పోలింగ్ డిసెంబర్ 7న జరుగుతుందని చీఫ్ ఎన్నికల కమీషనర్ ఓపి రావత్ ప్రకటించారు.  మొత్తం పోలింగ్ అంతా ఒకే దశలో జరుగుతుందని చెప్పారు. ఈరోజు మీడియాతో మాట్లాడిన రావత్ మధ్యప్రదేశ్, రాజస్ధాన్, చత్తీస్ గఢ్, మిజోరం ఎన్నకల షడ్యూల్ ప్రకటించారు. ఓటర్ల జాబితా అవకతవకలపై కోర్టులో కేసు ఉన్న కారణంగా తెలంగాణాలో షెడ్యూల్ ప్రకటించలేమని చెప్పారు. అయితే, మీడియా సమావేశం ముగిసేలోగానే హఠాత్తుగా తెలంగాణా షెడ్యూల్ కూడా ప్రకటించేశారు.


 తెలంగాణా ఎన్నికలకు సంబంధించి నవంబర్ 19 నామినేషన్ల దాఖలుక చివరి తేదీగా చెప్పారు. ఉపసంహరణల గడువు నవంబర్ 22గా నిర్ణయించారు. అయితే, నవంబర్ 28న నామినేషన్లను పరిశీలించి అదే రోజు అభ్యర్ధుల జాబితాను ప్రకటిస్తారు. నవంబర్ 12న ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతుంది. మొత్తం 119 స్ధానాలకు ఒకే దశలో పోలిం జరుగుతుందని రావత్ ప్రకటించారు.


రావత్ ప్రకటనతో తెలంగాణాలో ఒక్కసారిగా ఎన్నికల వేడి రాజుకున్నట్లే. ఇప్పటికే 105 మందితో  టిఆర్ఎస్ మొదటిజాబితాను టిఆర్ఎస్ చీఫ్ కెసియార్ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రతిపక్షాలు అంటే కాంగ్రెస్, టిడిపి, సిపిఐ, టిజెఎస్ ఒక కూటమిగా ఏర్పడ్డాయి. అయితే ఇంకా వాటిమధ్య సీట్ల విషయంలో పొత్తులు ఖరారు కాలేదు. ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదలైంది కాబట్టి ఒకటి రెండు రోజుల్లో అవి కూడా పొత్తులు ఖరారు చేసుకుని అభ్యర్ధులను ప్రకటిస్తారని అనుకుంటున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: