సమాజంలో మనిషి రోజురోజుకి చాలా దారుణంగా దిగజారిపోయి మరి ప్రవర్తిస్తున్నాడు. ఒకపక్క అక్రమ సంబంధాలతో కుటుంబాలు కోల్పోతుంటే మరోపక్క ప్రేమించుకున్న ప్రేమ జంటలకు కులం అడ్డు వచ్చి తమ ప్రాణాలను పోగొట్టుకుంటున్న సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల మిర్యాలగూడలో ఇటువంటి సంఘటనే చోటు చేసుకున్న విషయం మనకందరికీ తెలిసిందే.


ఈ క్రమంలో బీహార్ రాష్ట్రంలో కూడా ఈ విధంగానే ఓ ఘటన చోటు చేసుకుంది. అగ్రకులానికి చెందిన అమ్మాయి దళిత వర్గానికి చెందిన అబ్బాయిని ప్రేమించడం తో అగ్రవర్ణ కులానికి చెందిన అమ్మాయి కుటుంబ సభ్యులు అలాగే ఆ ఊరి వారు ఆ అమ్మాయిని దారుణంగా ఊరి మధ్య ప్రజల ముందు నిలబెట్టి చెట్టుకు కట్టేసి కొరటాలతో కొట్టిన సంఘటన అందరినీ కలిచి వేసింది. నవాడా జిల్లాలోని రాజౌలిలో ఈ ఘటన చోటు చేసుకుంది..రాజౌలికి చెందిన యువతి, ఒక దళిత యువకుడు కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు.

Image result for pranay amrutha

పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నారు. అయితే అమ్మాయి తల్లిదండ్రులు అందుకు ఒప్పుకోలేదు. ఊరు కూడా ససేమిరా అంది. దీంతో వారు గత నెల 30న ఇళ్లలోంచి వెళ్లిపోయారు. పనులు చేసుకుంటూ దగ్గర్లోని గ్రామంలో జీవిస్తున్నారు. దీన్ని భరించలేని అమ్మాయి కుటుంబసభ్యులు మందీ మార్బలంతో వెళ్లి ఆమెను బలవంతంగా ఊరికి తీసుకొచ్చి పంచాయితీ పెట్టించారు.

Image result for బీహార్ పంచాయితీ

దీంతో పంచాయతీ పెద్దలు గా ఉన్న వ్యక్తులు అమ్మాయిని చూడగానే ఆగ్రహించి చెట్టుకు కట్టేసి దారుణంగా హింసించారు..తల్లిదండ్రులు కూడా అలా చూస్తూ ఉండిపోయారు.. దెబ్బలకు తట్టుకోలేక ఆమె చాలాసార్లు స్పృహ తప్పి పడిపోయింది. దాహంతో అల్లాడిపోయింది.. అయినా ఎవరూ కనికరించకుండా హింసించారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసు కేసు నమోదైంది.



మరింత సమాచారం తెలుసుకోండి: