పవన్ కళ్యాణ్ పార్టీ ఎక్కడ ప్రభావం చూపించిన చూపించక పోయిన ఉత్తరాంధ్ర లో మాత్రం ప్రభావం చూపిస్తుందని అందరూ అంచనా వేశారు అయితే ఇప్పడూ సీన్ మొత్తం రివర్స్ ఐయింది. జనసేన తరఫున ఉత్తరాంధ్రలో బలమైన నాయకుడే లేని పరిస్థితి. ప్రస్తుతం ఉత్తరాంధ్రలో వైఎస్‌ జగన్‌ ప్రజా సంకల్పయాత్ర కొనసాగుతోంది. విశాఖలో జరిగిన పాదయాత్ర, ప్రస్తుతం విజయనగరంలో జరుగుతున్న పాదయాత్ర.. జన సంద్రాన్ని తలపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జనసేన వర్గాలు తీవ్ర ఆందోళన చెందుతున్నాయట.

Image result for pavan and janasena

అసత్వమే తమ కొంప ముంచిందన్న భావనకు వచ్చిన స్థానిక నేతలు కొందరు, జనసేనాని సమక్షంలో చిన్నా చితకా నేతల్ని, కార్యకర్తల్ని జనసేలో చేర్పించి.. హడావిడి చేస్తున్నారు. మరోపక్క, పరిస్థితిని పవన్‌కళ్యాణ్‌ సైతం సమీక్షించాల్సి వస్తోంది. 'ఎక్కడ లోపం జరిగింది.?' అంటూ పార్టీ యంత్రాంగంతో పోస్ట్‌ మార్టమ్‌ షురూ చేశారట. నిజానికి, ఆంధ్రప్రదేశ్‌లో జనసేన ఎక్కువగా ఆశలు పెట్టుకున్నది ఉత్తరాంధ్ర మీదనే. రెండు నుంచి మూడు ఎమ్మెల్యే స్థానాలు ఉత్తరాంధ్ర నుంచి గెలిచే అవకాశం వుందంటూ జనసేన గురించి అప్పట్లో రాజకీయ పండితులూ అంచనా వేశారు. ఇప్పుడు కనీసం డిపాజిట్లు వచ్చే పరిస్థితి లేదని ఆ రాజకీయ పండితులే తేల్చేస్తున్న పరిస్థితి.

ఉత్తరాంధ్రలో జనసేన పప్పులుడకట్లేదా.?

ప్రస్తుతానికి జనసేనాని పశ్చిమగోదావరి జిల్లాలో హల్‌చల్‌ చేస్తున్నారు. ఆ తర్వాత ఆయన టూర్‌ తూర్పుగోదావరి జిల్లాలో సాగనుంది. రాజమండ్రిలో రోడ్‌ కమ్‌ రైలు బ్రిడ్జి మీద 'షో' చేద్దామనుకున్న పవన్‌కళ్యాణ్‌కి, అధికారుల నుంచి రెడ్‌ సిగ్నల్‌ ఎదురయ్యింది. బ్రిడ్జి భద్రత దృష్ట్యా ఆ ఆలోచన మార్చుకోవాలని పవన్‌కి అధికారులు తేల్చి చెప్పడంతో, ధవళేశ్వరం బ్రిడ్జిని ఎంచుకోవాల్సి వచ్చింది పవన్‌కళ్యాణ్‌కి.

మరింత సమాచారం తెలుసుకోండి: